Cricket

Tom Latham Century Video: వీడియో ఇదిగో, కెరీర్‌లో ఎనిమిదవ సెంచరీ నమోదు చేసిన లాథమ్‌, పాక్ బౌలర్లను ఊచకోత కోసిన న్యూజిలాండ్ బ్యాటర్

Hazarath Reddy

లాథమ్‌ 103 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేసి 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యంగ్-లాథమ్ జోడీ నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లాథమ్‌-ఫిలిప్‌ జోడీ సైతం ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

Will Young Slams First Century Video: వీడియో ఇదిగో, పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన విల్ యంగ్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన న్యూజీలాండ్ తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు

Hazarath Reddy

ఈ మ్యాచ్ లో విల్ యంగ్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పాక్ బౌలర్లకు నరకం చూపించాడు. యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు.

Kane Williamson Wicket Video: కేన్ విలియమ్సన్ వికెట్ వీడియో ఇదిగో, నసీమ్ షా అద్భుతమైన డెలివరీకి కీపర్ చేతికి చిక్కిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్‌ (ICC Champions Trophy 2025) జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది.ప్రారంభంలోనే న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. డేవాన్‌ కాన్వే (10), కేన్‌ విలియమ్సన్‌ (1), డారిల్‌ మిచేల్‌ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఫస్ట్ వికెట్ వీడియో ఇదిగో, డెవాన్ కాన్వేను అద్భుతమైన డెలివరీతో పెవిలియన్ పంపిన పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్

Hazarath Reddy

లెగ్ స్పిన్నర్ తన రెండవ ఓవర్ బౌలింగ్ చేస్తూ, డెవాన్ కాన్వే ను పెవిలియన్ పంపాడు. బాల్ బ్యాట్ అంచును దాటి ఆఫ్-స్టంప్‌ను ముద్దాడింది. పాక్ బౌలర్.. డెవాన్ కాన్వే మరియు విల్ యంగ్ మధ్య 39 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు

Advertisement

Shubman Gill: వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా శుభ‌మ‌న్ గిల్, బాబ‌ర్ ఆజ‌మ్‌ను వెన‌క్కి నెట్టేసిన టీమిండియా ఓపెనర్, ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ర్యాంకింగ్స్ ఇవిగో..

Hazarath Reddy

ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ర్యాంకింగ్స్ లో భారత రైట్ హ్యాండ్ స్టార్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌(Shubman Gill).. వ‌న్డేల్లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సాధించాడు. పాకిస్థాన్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్‌ను వెన‌క్కి నెట్టి గిల్ ఆ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కావ‌డానికి ముందు.. ఐసీసీ తాజా వ‌న్డే ర్యాంక్ లిస్టును రిలీజ్ చేసింది

1xBet: డర్బన్స్ సూపర్ జెయింట్స్‌ నుండి కేశవ్ మహారాజ్, మాథ్యూ బ్రీట్జ్‌కీ మరియు కేన్ విలియమ్సన్‌లతో లైవ్ మీట్ & గ్రీట్,పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

1xBet అనేది SA20 2025 కోసం జట్టు అధికారిక స్పాన్సర్‌ కాగా, దానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌కు చెందిన అగ్రశ్రేణి స్టార్‌లతో ఇటీవలి స్ట్రీమ్‌ను పోస్ట్ చేయగా, ఇది క్రికెట్ అభిమానులకు రుచికరమైన విందుగా మారింది.

ICC Champions Trophy 2025: వీడియో ఇదిగో, ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ బరితెగింపు, కరాచీ స్టేడియంలో మిగత దేశాల జెండాలను పెట్టి భారత జెండాను వదిలేసిన దాయాదీలు

Hazarath Reddy

ట్రోఫీ ఆరంభానికి ఇంకా రెండు రోజులే సమయమున్న నేపథ్యంలో కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయజెండాలను ప్రదర్శించారు .అయితే అందులో భారత జాతీయ జెండా లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

MI IPL 2025 Schedule: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ షెడ్యూల్ ఇదిగో, మార్చి 23న చెన్నైలో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ముంబై

Hazarath Reddy

కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌-2025 షెడ్యూల్‌ ప్రకటించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా మార్చి 22న మొదలై రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించనునుంది ఐపీఎల్‌-18వ సీజన్‌. మే 25న జరిగే ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

Advertisement

IPL 2025 Schedule: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్‌ వచ్చేసింది, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

VNS

ఐపీఎల్‌ 2025 (IPL 2025) హంగామా మొదలైంది. క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22న ఈ సీజన్‌ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగునున్న ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Rajat Kumar Takes Poison: రోడ్డు ప్రమాదంలో రిష‌బ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి ప్రియురాలితో కలిసి ఆత్మహత్యాయత్నం, ప్రియురాలు మృతి, చావుబతుకుల్లో రజత్ కుమార్

Hazarath Reddy

2022 డిసెంబ‌ర్‌లో ఉత్త‌రాఖండ్‌లోని రూర్కీ వ‌ద్ద రిష‌బ్ పంత్ కారు ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో ఆ క్రికెట‌ర్‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు కాపాడారు. భారత క్రికెటర్ ను కాపాడిన ఇద్ద‌రిలో 25 ఏళ్ల ర‌జ‌త్ కుమార్(Rajat Kumar) ఒక‌రు. అయితే ఫిబ్రవరి 9న ర‌జ‌త్ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది.

Rajat Patidar is RCB New Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వెల్లడించిన ఫ్రాంఛైజీ, జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించిన విరాట్ కోహ్లీ

Arun Charagonda

ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పాటిదార్‌ ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం.

India Beat England by 142 Runs: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్, మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో (IND vs ENG) టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ (Team India) సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Shubman Gill: నయా హిస్టరీ క్రియేట్ చేసిన శుబ్‌మన్ గిల్, కెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు, 50 ఇన్నింగ్స్‌ల్లోనే మైల్‌స్టోన్‌

Hazarath Reddy

భార‌త క్రికెట‌ర్, టీమిండియా వైస్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్(Shubman Gill) ఖాతాలో మరో కొత్త రికార్డు చేరింది. వ‌న్డేల్లో అతి వేగంగా 2500 ర‌న్స్ చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్‌లో గిల్ ఆ ప‌రుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో ఆ మైలురాయిని గిల్ అందుకున్నాడు.

Virat Kohli: భారత తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించిన కోహ్లి, అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

అహ్మదాబాద్‌ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

Anil Kumble Visits Maha Kumbh: ప్రయాగరాజ్ మ‌హాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే దంప‌తులు, భక్తులతో కిక్కిరిసిపోయిన త్రివేణి సంగమం

Hazarath Reddy

నేడు మాఘ పౌర్ణ‌మి కావడంతో త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది.తాజా స‌మాచారం ప్ర‌కారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే కోటిన్న‌ర మంది పుణ్య స్నానం చేశారు. ఇక న‌దీ స్నానం కోసం వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య అధికంగా ఉన్న‌ది. దాదాపు 10 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు

ICC Champions Trophy 2025 All Squads: ఈ సారి భారత్ విజేతగా నిలబడుతుందా ఈ జట్టుతో.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాల్గొనే అన్నిజట్ల ఆటగాళ్లు జాబితా ఇదిగో

Hazarath Reddy

2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ షోపీస్ టోర్నమెంట్ తొమ్మిదవ ఎడిషన్‌గా ఉంటుంది. ఎనిమిది దేశాలు ఈ టైటిల్‌ను గెలుచుకోవడానికి పోరాడుతున్నాయి. తొమ్మిదవ ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గ్రూప్‌లో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌ను అనుసరిస్తుంది. మొత్తం ఎనిమిది దేశాలు నాలుగు గ్రూపులుగా (A మరియు B) విభజించబడతాయి

Advertisement

Steve Smith Catch Video: స్లిప్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్, ఒంటి చేత్తో అలా డైవింగ్ చేస్తూ పట్టుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

Virat Kohli Hugs Lady Fan: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ హ‌గ్ ఇచ్చిన ఆ ల‌క్కీ లేడీ ఎవరు ? సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చించుకుంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఫిబ్రవరి 12, బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేకు ముందు ఇతర ఆటగాళ్లతో కలిసి అహ్మదాబాద్‌కు బయలుదేరడానికి భువనేశ్వర్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే టీం ఇండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక అభిమానిని కౌగిలించుకున్నాడు

IND Win By Four Wickets: రెండో వన్డేలోనూ నాలుగు వికెట్లతో తేడాతో భారత్‌ ఘన విజయం, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, రోహిత్ శర్మ తాండవంతో ఈజీ విక్టరీ

VNS

ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ కైవ‌సం చేసుకుంది. క‌ట‌క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్ 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రోహిత్ శ‌ర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 305 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ 44.3 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Rachin Ravindra Injury Update: వీడియో ఇదిగో, కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తలకు బలమైన గాయం, క్యాచ్ మిస్ కావడంతో నుదిటికి బలంగా తాకిన బంతి

Hazarath Reddy

Advertisement
Advertisement