Selling ‘Special’ Bottle Gourds: నాగ సొరకాయలు..ఖరీదు అరకోటి పై మాటేనట, కుబేరులవుతారంటూ జనాలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, శ్రీశైలం దేవస్థానంలో ఘటన
కంగా కూరగాయలను మాయగా మార్చేసా లక్షల్లో భక్తులను మోసం చేస్తున్న ఘటనత జనాలు షాకయ్యే పరిస్థితి వచ్చింది. మాయ సొరకాయలు (Selling ‘Special’ Bottle Gourds) అంటూ జనాలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలను కేటుగాళ్లు పోగేసుకున్నారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఈ ముఠా గుట్టు రట్టయింది.
Srisailam, Oct 12: ఆంధ్రప్రదేశ్‌లో ఓ కొత్త దందా వెలుగులోకి వచ్చింది. కంగా కూరగాయలను మాయగా మార్చేసా లక్షల్లో భక్తులను మోసం చేస్తున్న ఘటనత జనాలు షాకయ్యే పరిస్థితి వచ్చింది. మాయ సొరకాయలు (Selling ‘Special’ Bottle Gourds) అంటూ జనాలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలను కేటుగాళ్లు పోగేసుకున్నారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఈ ముఠా గుట్టు రట్టయింది. ఘటన వివరాల్లోకెళితే..
ఏపీలోని కర్నూలు జిల్లాలో గల ప్రముఖ శ్రీశైలం దేవాలయంలో (Srisailam Bhramaramba Mallikarjuna temple) ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్న సొరకాయలను ఓ ముఠా అమ్మసాగింది. ఈ సొరకాయలు మామూలువి కాదని, వాటిలో చాలా శక్తులు ఉన్నాయని భక్తులను వారు మాయ చేశారు. ఈ సొరకాయలు నల్లమల్ల అడవుల్లో (Nallamala Forest)మాత్రమే పండుతాయని, వీటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుందని నమ్మించారు. ఇలా వారి మాటలను నమ్మిన కొందరు రూ. లక్షలు చెల్లించి ఆ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లారు. ఇంకొందరైతే ఒక్కో సొరకాయకు రూ. కోటి నుంచి రూ. 2 కోట్లు కూడా చెల్లించినట్లు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 21 మందిని అరెస్ట్ చేసినట్లు (21 arrested for selling ‘special’ bottle gourds) ఎస్సై నాగేంద్ర తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారని, శ్రీశైలంలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆశ్రమంతో వీరికి లింక్‌లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం నడుపుతున్న వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరందరిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు నాగేంద్ర వివరించారు. కాగా, ఈ సొరకాయలు పాముల ముందు ఊదే నాగస్వరం ఆకారంలో ఉంటాయి. వీటిని నాగ సొరకాయలు అని పిలుస్తుంటారు. ఇటీవల ఈ సొరకాయల విషయం బాగా హల్‌చల్ చేసింది. కాగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం కూడా ఒకటిగా వెలుగులు విరాజిల్లుతోంది.
ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ‘నాగస్వరంలా ఉండే సొరకాయల మీద తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది ఇవి కేవలం నల్లమలలోనే పెరుగుతాయని భావిస్తారు. అలాంటి సొరకాయ ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కానీ, అవేవీ నిజం కాదు.’ అని ఎస్ఐ నాగేంద్ర చెప్పారు.
ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా కొందరు ఇలాగే ప్రజల నమ్మకాలను ఆధారంగా చేసుకుని పురాతన నాణేల పేరిట జనంపై వల విసురుతున్నారు. ఎప్పుడో పాత కాలంనాటి నాణేలంటూ నమ్మబలికి వాటిని ఇంట్లో పెట్టుకుంటే మహర్దశ పడుతుందని నమ్మిస్తున్నారు.