New Delhi, October 6: కరోనా సమయంలో ఓ న్యూస్ భారీగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రధాన మంత్రి మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Mandhan Yojana) కింద అకౌంట్లు ఉన్న వాళ్లందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.3,000 చొప్పున ఇస్తోందని.. (Is Modi Government Giving Rs 3000) ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది చాలామందికి తెలియడం లేదు. అయితే ఇది అవాస్తవిక కథనమని, ఇలాటి ప్రకటన ఏదీ కేంద్రం చేయలేదని ప్రెస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక ట్వీట్‌లో స్పష్టం చేసింది.
'ప్రధాని మాన్‌ధన్ యోజన కింద అకౌంట్లు ఉన్న వారందరికీ రూ.3000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ యూ ట్యూబ్ వీడియో ఒకటి క్లెయిమ్ చేసింది. ఇదో నకిలీ వార్త. ఇలాంటి ఏ స్కీమ్ కింద కూడా ప్రభుత్వం రూ.3000 చెల్లించడం లేదు' అని పీఐబీ ట్వీట్ చేసింది.
కాగా ఇంటర్నెట్లో వచ్చే తప్పుడు సమాచారానికి కళ్లెం వేసేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ వింగ్ 2019లో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం సైతం గతంలో సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ కాని వార్తలపై పలుమార్లు వివరణ ఇచ్చింది. నకిలీ వార్తలను ఎవరూ షేర్ చేయవద్దని, ఇలాంటివి షేర్ చేసేటప్పుడు విశ్వసనీయ సమాచారం తీసుకుని, పూర్తిగా నిర్దారణ చేసుకున్న తర్వాతే షేర్ చేయాలని సూచించింది.