AP Special Assembly Session: క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, రాజధానిపై కమిటీలు అందించిన నివేదికపై చర్చలు, కీలక ప్రకటన వెలువడే అవకాశం

ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (AP Legislative assembly), 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ (High Power committee) నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravathi, January 12: ఏపీ రాజధానిపై (AP Capital)ఏదో ఒకటి తేల్చేందుకు ప్రభుత్వం (AP GOVT) శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (AP Legislative assembly), 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ (High Power committee) నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

రాజధాని సహా రాష‍్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు

మండలి సమావేశం మాత్రం ఒకే రోజుతో ముగిస్తారు. రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ,(GN Rao committee) బీసీజీ నివేదికలను(Boston committee) రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెడుతుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్‌ కమిటీ నివేదికను కూడా ప్రవేశ పెడతారు.

రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి

రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమకు అందిన రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ దశల వారీగా సమగ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

అమరావతి రైతుల (Amaravathi Farmers)ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. జనవరి 18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది.

అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ

కేబినెట్ భేటీలో చర్చ అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మరోవైపు ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడిన కమిటీ.. రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది.



సంబంధిత వార్తలు