Srikakulam Bus Accident: శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా, 33 మందికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు

పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలనూ వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న కూలీలను (Migrants) ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మంది గాయపడిన సంఘటన (Srikakulam Bus Accident) శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు శ్రీకాకుళం జిల్లా మందన మండలం బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 33 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road accident at Naguluppalapadu in Prakasam 9-daily-labours-has-dead-in-andhra-pradesh (Picture Credits: ANI)

Srikakulam, May 26: కరోనావైరస్ (coronavirus) ప్రజలను అనేక కష్టాలకు గురిచేస్తోంది. పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలనూ వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న కూలీలను (Migrants) ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మంది గాయపడిన సంఘటన (Srikakulam Bus Accident) శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో లక్షా 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి

బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు శ్రీకాకుళం జిల్లా మందన మండలం బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 33 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Here's ANI Tweet

ఇదిలా ఉంటే జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో ఖుడియా నది బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, మహిళ సహా ఐదుగురు మృతి చెందారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.  హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, ఇప్పటివరకు 214 కేసులు నమోదు, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ లాక్‌డౌన్ అమలు

స్థానికుల సహాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారు జార్ఖండ్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif