AP Assembly Special Sessions: శాసన మండలి రద్దు, తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ సీఎం, అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ, గవర్నర్, స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (Andhra Pradesh Assembly) రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( CM YS Jagan) మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చకు చేపట్టింది.

AP CM YS Jaganmohan Reddy | Photo Credits: ANI

Amaravathi, January 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (Andhra Pradesh Assembly) రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( CM YS Jagan) మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చకు చేపట్టింది.

ఇందులో భాగంగా మండలి రద్దు తీర్మానంపై (Abolition of legislative council) డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం

అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే (TDP Leaders)కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు (Three Capitals) అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు.

ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి

అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం మండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలకమైన బిల్లులను మండలి తిరిస్కరించిన విషయం తెలిసిందే.

మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

పైగా వికేంద్రీకరణకు సంబంధించి కీలకమైన బిల్లును రూల్ 71 పేరుతో అడ్డుకోవడమే కాకుండా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే తనకున్న విచక్షణాధికారాల మేరకు దానిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే మండలిని రద్దు చేయాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.

బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్

మంత్రివర్గం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)ని సమావేశపరిచారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరుకాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు శాసనసభ ప్రారంభం కాగానే మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రవేశపెట్టారు.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు టీడీపీ శాసన సభా పక్షం లేఖ రాసింది. సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లగించారని ఫిర్యాదు చేశారు. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బీఏసీలో నిర్ణయించారని.. అయితే మరో మూడు రోజుల పాటు ఇష్టానుసారం సభను పొడిగించటం సబబు కాదని లేఖలో పేర్కొన్నారు.

3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్

శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం రూల్స్‌‌కు విరుద్ధమన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కౌన్సిల్‌లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే చర్చలో పాల్గొనకూడదనే సభను బాయ్‌కాట్ చేశామని టీడీపీ శాసన సభాపక్షం స్పష్టం చేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement