AP Coronavirus Bulletin: వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్
కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
Amaravati, April 27: ఏపీలో కరోనా (Andhra Pradesh Coronavirus) పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఆదివారం 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,097కు చేరుకుంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో పదిలక్షల మంది జనాభాకు 418 మందికి టెస్టులు చేస్తుంటే, రాష్ట్రంలో 1, 147 టెస్టులు చేస్తున్నారు.
తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కర్నూలు ఎంపీ (kurnool MP Dr Sanjeev Kumar) డాక్టర్ సంజీవ్‌కుమార్ తెలిపారు. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కోవిడ్–19 (COVID-19) బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఏఎస్‌ఐ హబీబుల్లా కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్వయంగా వెళ్లి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆ కుటుంబానికి అందజేయాలని సీఎం ఆదేశాలతో డీజీపీ గౌతం సవాంగ్ శనివారం అనంతపురంలో పర్యటించారు. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్‌ఐ కుటుంబ సభ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కును ఏఎస్‌ఐ సోదరుడు కానిస్టేబుల్ రహంతుల్లాకు అందజేశారు. కోవిడ్ యుద్ధంలో పాల్గొంటున్న పోలీసులకు రక్షణగా ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ), ఎన్ 95 మాస్క్‌లు అందించడం కోసం రూ. 2.89 కోట్లు విడుదల చేసిందని ఆయన అన్నారు. అమల్లోకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం, ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ
మరోవైపు రాజ్‌భవన్‌కు (Raj Bhavan staffers) చెందిన నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. చీఫ్ సెక్యూరిటీ అధికారితో పాటు నర్సింగ్ సిబ్బందికి కరోనా సోకింది. సిబ్బందిలో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో గవర్నర్ సహా 8 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యసిబ్బందిలో ఒకరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నరసరావుపేటలో ఒక ప్రముఖ వైద్యునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. ఆయనతో పాటు ఆసుపత్రి సిబ్బంది, 167 మంది ఔట్ పేషెంట్లను కూడా క్వారంటైన్‌కు తరలించామని అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖ సాంకేతిక బృందానికి డీజీపీ అభినందనలు, నిఘా కోసం అత్యంత అధునాతన టెక్నాలజీ వాడుతున్నామన్న దామోదర్ గౌతం సవాంగ్
ఇదిలా ఉంటే పేకాట సరదా కారణంగా ఒక్క వ్యక్తి నుంచి 25 మందికి కరోనా వైరస్ సోకడంతో నగరంలో కలకలం సృష్టించింది. సరదా కోసం పేకాట, హౌసీ ఆడినందుకు ఒకే చోట 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మరో ప్రాంతంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 14 మందికి కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు. రెడ్ జోన్‌లో విధులు నిర్వహించిన ఎస్‌ఐ వైరస్ బారినపడ్డారని వెల్లడించారు. కాంటాక్ట్స్ అందరినీ క్వారంటైన్‌కు తరలించామని సీపీ పేర్కొన్నారు.ఆపదలో ఉన్న కరోనా పాజిటివ్ మహిళకు సాయం చేసిన మరో ఎస్‌ఐ, కాంటాక్ట్స్ ను క్వారంటైన్‌లో పెట్టామని తెలిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి
శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఆదివారం పాతపట్నం పరిసరాల్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా ల్యాబ్ ఏర్పాటు చేశామని.. ర్యాపిడ్, ట్రూనాట్ కిట్స్ ద్వారా పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోనే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామన్నారు.
జెమ్స్ ఆసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా చేశామని చెప్పారు. 32 క్వారంటైన్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.పాతపట్నం ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించామన్నారు. 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని..పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిత్యావసర సరుకులు అందేవిధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గుజరాత్‌లో ఉన్న మత్స్యకారులను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 177కు చేరింది. కర్నూలు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 279కి, గుంటూరులో 3 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 214కు చేరింది. కృష్ణా జిల్లా తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 12 కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 51కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 6,768 శాంపిల్స్ పరీక్షించగా.. 81 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,034 మందికి పరీక్షలు నిర్వహించగా.. 66,937 మందికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు
రాష్ట్రంలో తొలిసారిగా ఆదివారం 60 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 231కు చేరింది. ఆదివారం బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నుంచి 24 మంది, నెల్లూరు జిల్లా నుంచి 15 మంది, ప్రకాశం నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు, చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు చొప్పున.. పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 31 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌తో 835 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా (కోవిడ్-19) పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలతో పాటు, వైరస్ వ్యాప్తిని నియంత్రణపై ఆదివారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే రెడ్ జోన్లులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.