AP DGP Gowtham Sawang: పోలీస్ శాఖ సాంకేతిక​ బృందానికి డీజీపీ అభినందనలు, నిఘా కోసం అత్యంత అధునాతన టెక్నాలజీ వాడుతున్నామన్న దామోదర్ గౌతం సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సాంకేతిక​ బృందానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP gowtham sawang) అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌ (Coronavirus) నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సారధ్యంలో పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వచ్చిన వారి కదలికలను దేశంలోనే తొలిసారిగా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో (Geo-fencing app) అనుసంధానం చేశామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు.

Andhra pradesh dgp-gautam-sawang-calls-people-support-janata-curfew (Photo-Facebook)

Amaravati, April 24: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సాంకేతిక​ బృందానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP gowtham sawang) అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌ (Coronavirus) నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సారధ్యంలో పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు, తాజాగా 80 కొత్త కేసులు నమోదు, ఏపీలొ 893కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వచ్చిన వారి కదలికలను దేశంలోనే తొలిసారిగా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో (Geo-fencing app) అనుసంధానం చేశామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు.

డీజీపీ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై నిఘా కోసం అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినట్లు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్‌ యాప్‌ ద్వారా జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీతో పర్యవేక్షించినట్లు చెప్పారు. జియో ఫెన్సింగ్ టెక్నాలజీని నిబంధనలు ఉల్లంఘించిన 3,043 వారిపై కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి

జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నమోదు చేసుకున్న నాటి నుండి నిన్నటి వరకు ఇరవై ఎనిమిది రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలు తొలగించామన్నారు. సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పించామని చెప్పారు.

Here's AP Police Awareness programs

22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశామని, జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 28 రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. కేరళలొ నెలల పసిపాపను చంపేసిన కరోనా, ఇండియాలో 23 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 718కి చేరిన మృతుల సంఖ్య

రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనని కొనియాడారు. కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటామన్నారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టడం జరిగిందని...త్వరలోనే రెడ్‌జోన్ ఏరియాల నుండి బయటకు రాకుండా ఉండేందుకు సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైల్‌యాప్‌ను రూపొందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ మహిళ మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు శీతల పానీయాలు అందించిన వీడియో రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. అమె వివరాలు తెలుసుకొని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా ఆమెతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ అమ్మతనానికి మేమంతా చలించిపోయాం. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై మీరు చూపిన ప్రేమకు మేమంతా సెల్యూట్‌ చేస్తున్నామమ్మా’’ అంటూ ధన్యవాదాలు తెలిపారు.

Here's Video

విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సదరు మహిళ రెండు పెద్ద బాటిల్స్‌తో శీతల పానీయాలను తెచ్చి అందివ్వగా.. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉంటే చాలు, తమకు ఇంకేమీ వద్దమ్మా అంటూ పోలీసులు సున్నితంగా తిరస్కరిస్తారు. అయినప్పటికీ తీసుకోవాల్సిందిగా ఆ మహిళ మరీ మరీ కోరతారు. ఆ తరువాత తన వివరాలు అడిగిన పోలీసులకు తనో కూలీనని, తన ఆదాయం నెలకు మూడువేలని చెపుతారు.

మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న పోలీసుల గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తాను ఇలాచేసానని ఆమె వివరిస్తారు. దీనితో చలించిపోయిన పోలీసులు ''అమ్మా, మీకు వీలైతే మీ ముఖం రోజూ ఒకసారి మాకు చూపిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది'' అంటూ సాగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now