Power Holiday In AP: పరిశ్రమలకు శుక్రవారం నాడు పవర్‌ హాలిడే, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నామన్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథ రావు

ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్‌ హాలిడే (Power Holiday In AP) అమలు చేయనున్నట్లు సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Power-Supply

Amaravati, April 8: ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్‌ హాలిడే (Power Holiday In AP) అమలు చేయనున్నట్లు సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పుత్తూరు డివిజన్‌ను మినహాయించి, మిగతా అన్ని డివిజన్లలో శుక్రవారం పవర్‌ హాలిడే అమలు చేయనున్నట్లు ఆయన (CMD Haranath Rao) తెలిపారు.విద్యుత్‌ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం (Power Holiday For Industries) తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం పరిశ్రమలకు వారానికోరోజు వారాంతపు సెలవులను అమలు చేస్తున్నాయని, దీనికి అదనంగా ఒకరోజు పవర్‌ హాలిడేను అమలు చేయాలని పారిశ్రామిక వినియోగదారులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాలపాటు పవర్‌ హాలిడే అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం కోవిడ్‌–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్‌ వినియోగం అధికమైందన్నారు.

పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలు, నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబుపై మండిపడిన ఏపీ సీఎం జగన్

విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో బొగ్గు లభ్యత లేకపోవడం, పవర్‌ ఎక్స్‌చేంజ్‌లలో డిస్కమ్‌లకు 14వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా కేవలం 2వేల మెగా వాట్ల విద్యుత్‌ మాత్రమే ఉన్నందున సమస్యకు కారణమవుతోందన్నారు. విద్యుత్‌ కోతల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. విద్యుత్‌ సరఫరా తీరును ప్రతిరోజూ సమీక్షించి, మెరుగై నసరఫరాకు తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆ ఐదారుగురు ఎవ‌రు? ఏపీలో హాట్ టాఫిక్‌గా మారిన కొడాలి నాని వ్యాఖ్యలు, ప‌ద‌వుల‌తో పాటు కాన్వాయ్‌ల‌నూ వ‌దిలేసిన 24 మంది మంత్రులు, సీఎం జగన్ స్పందన ఇదే

బొగ్గు కొరత వల్ల దేశ్యవాప్తంగా విద్యుత్‌ సంక్షోభం నెలకొందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి లేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఉందన్నారు. ఏపీలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి 185 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పేర్కొన్నారు.

ఏపీలో మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా, ఏపీ సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపిన కొడాలి నాని, ఏప్రిల్‌ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

వేసవిలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 240 మిలియన్‌ యూనిట్లకు చేరుకుందని తెలిపారు. ఉత్పత్తి, డిమాండ్‌ మధ్య 50 మిలియన్‌ యూనిట్ల వ్యత్యాసం ఉందని వివరించారు. రోజుకి రూ.30 కోట్లతో అదనంగా విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎంతపెట్టి అయినా కొనేందుకు సిద్ధంగా ఉన్నా.. విద్యుత్‌ అందుబాటులో లేదని శ్రీధర్‌ పేర్కొన్నారు.