Nandyal, April 8: నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఎల్లో మీడియా, చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో (TDP for misleading public by false news) రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy). ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు సీఎం జగన్. గత ప్రభుత్వం హయాలంలో తక్కువగా ఉన్నజీఈఆర్ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను కోరారు సీఎం జగన్. నాడు-నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ.. సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, యెల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు.
ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, యెల్లో మీడియాలు ఉండటం.. పరువు తీయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ తనను బెదిరించలేవని, ప్రజల దీవెనలతో ‘జగన్ అనే నేను’ ఈ స్థానంలోకి వచ్చానని గుర్తు చేశారాయన. దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు.
ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతుంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు అసూయ కలుగుతుందని ఆరోపించారు . అసూయను తగ్గించుకోకపోతే బీపీ, గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారని వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రెండో విడత జగనన్న వసతి దీవెన కింద 10లక్షల 68 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లను వైఎస్ జగన్ జమ చేశారు.
రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెనను ప్రారంభించామన్నారు. పేదలకయ్యే ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా అందజేసి తల్లిదండ్రులను ఆదుకుంటున్నామన్నారు.
కుటుంబంలోని ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ వసతి దీవెనను అందజేస్తామన్నారు. తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేయడం వల్ల కళాశాలల్లో సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు. కళాశాలల్లో సౌకర్యాలు కల్పించకపోతే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చే కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కళాశాలలు రానున్నాయని అన్నారు. స్కీల్ డెవలప్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని వివరించారు. విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 8.64శాతం పెరిగిందన్నారు.
ఇక పల్నాడు జిల్లా నరసరావు పేటలో గ్రామ, వార్డు వాలెంటీర్లకు జరిగిన సన్మాన సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై లేనిపోని పుకార్లు లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని, కానీ… దీనిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ తనకు క్లాస్ పీకారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
వాళ్లేమైనా ప్రధాని మోదీ సోఫా కింద దూరి విన్నారా? లేదా తన సోఫా కిందనో దూరి విన్నారా? అంటూ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని చూస్తుంటే అసూయకు హద్దేముంది? అని అనిపిస్తోందని జగన్ పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దొంగల ముఠాల వ్యవహరి స్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యనించారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో మకాం వేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వారి దుర్మార్గపు ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ప్రజలను కోరారు.