Rapid COVID-19 Test Kits in AP: కరోనా కట్టడికి ఏపీలో కీలక అడుగు, కోవిడ్–19 ర్యాపిడ్ టెస్టు కిట్లను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఈ కిట్ల ద్వారా 55 నిమిషాల్లోనే కరోనా ఫలితం
Amaravati, April 10: కరోనాకట్టడికి ఏపీలో (Andhra Pradesh) మరో అడుగు పడింది. కరోనా వైరస్ నిర్ధారించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను (COVID-19 Test Kits in AP) తయారు చేయడం ద్వారా ఏపీ రికార్డు సృష్టించింది. కోవిడ్–19 ర్యాపిడ్ టెస్టు కిట్ల తయారీలో రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y S Jagan Mohan Reddy) ప్రశంసించారు.
వైద్య సేవలందిస్తున్నవారికి సెల్యూట్, వారి సేవలు వెల కట్టలేనివంటూ కొనియాడిన ఏపీ సీఎం జగన్
రాష్ట్రంలో తయారైన కోవిడ్–19 ర్యాపిడ్ టెస్టు కిట్లను ( Rapid COVID-19 test kits) బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పాల్గొన్నారు.
Here's AP CMO Tweet
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రచారం, ఆర్భాటం లేకుండా అత్యంత కీలక సమయంలో వైరస్ నిర్ధారణ కిట్ల తయారీ రాష్ట్రంలో ప్రారంభమవడం వల్ల పరీక్షలు చేసే సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన వెంటిలేటర్లను కూడా వీలైనంత త్వరగా అందించాలని సూచించారు. టెస్ట్ కిట్ల తయారీ, పనిచేసే విధానాన్ని మెడ్‌టెక్ జోన్ సీఈఓ డా.జితేంద్ర శర్మ, సిబ్బంది ముఖ్యమంత్రికి వివరించారు.
ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై పలు విషయాలు
దేశంలో మూడు కంపెనీలకు మాత్రమే కిట్ల తయారీకి సంబంధించి అనుమతులున్నాయి. రాష్ట్రంలోని మెడ్‌టెక్ జోన్‌లో మోల్ బయో సంస్థ ఈ కిట్ల తయారీ ప్రారంభించింది. త్రీడీ ప్రింటింగ్ ల్యాబొరేటరీలో కిట్లు తయారవుతున్నాయి. ఏప్రిల్ రెండో వారానికి రోజుకు 10 వేల కిట్లు, మే నెల మొదటి వారానికి రోజుకు 25 వేల కిట్లు తయారు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
కరోనావైరస్ రోగ నిరోధక శక్తికి 'జగనన్న గోరుముద్ద'
అత్యంత కీలకమైన వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. ఈ నెలలో 3 వేల వెంటిలేటర్లు తయారవుతాయి. మే నుంచి ప్రతి నెలా 6 వేల వెంటిలేటర్లు తయారవుతాయి. ప్రస్తుతం రోజుకు 2 వేల పర్సనల్ ఎక్విప్‌మెంట్ కిట్లు తయారవుతున్నాయి. రోజుకు 10 వేల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్ల చొప్పున మూడు రోజుల్లో మరో 30 వేల పీపీఈలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.
ఏపీలో కరోనాతో ఆరుమంది మృతి, 363కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య
బహిరంగ మార్కెట్‌లో ఈ కిట్ ధర రూ. 4,500 ఉండగా కేవలం రూ. 1,200కే అందజేస్తున్నారు. ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చు. కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ కిట్లను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని ఐటీ మంత్రి తెలిపారు.
హిందుస్థాన్ లైఫ్ కేర్ లిమిటెడ్ (హెచ్‌ఎల్‌ఎల్) సంస్థతో కలసి ఏప్రిల్ 15 నుంచి నెలకు 3,000 వెంటిలేటర్లు తయారు చేయనున్నారు. ఒక్క వెంటిలేటర్ సహాయంతో ఐదారు మందికి వైద్యం చేసేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు.