COVID-19 in AP: వైద్య సేవలందిస్తున్నవారికి సెల్యూట్, వారి సేవలు వెల కట్టలేనివంటూ కొనియాడిన ఏపీ సీఎం జగన్, కరోనా కట్టడిపై కలెక్టర్లు, వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌
AP Chief Minister CM YS Jagan Mohan Reddy | File Photo.

Amaravati, April 10: కరోనా మహమ్మారిపై (COVID-19) జరుగుతున్న యుద్దంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) కొనియాడారు. ప్రతి జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రులు, క్రిటికల్‌ ఆస్పత్రుల్లో వీరంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా చర్యలపై కలెక్టర్లు, వైద్య సిబ్బందితో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM YS Jagan Video conference) ద్వారా మాట్లాడారు.

ఏపీలో కరోనాతో ఆరుమంది మృతి, 363కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య

వైద్య సేవలందిస్తున్న వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నా. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చినవారి కారణంగా కేసుల సంఖ్య పెరిగింది. తెలియని భయం ఉన్నా సేవలు చేస్తున్న వైద్యులకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి వచ్చినవారందరినీ గుర్తించాం. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’ అని సమీక్షలో జగన్ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ పూర్తిగా ట్రేస్‌ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తిగా క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌లో పెట్టాం. మొత్తం మీద ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని' జగన్‌ పేర్కొన్నారు.

ఏపీలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అకాలవర్షాలపై సమీక్ష నిర్వహించారు. పంట నష్ట వివరాలు నమోదు చేసి తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనల్లో బాధిత కుటుంబాలకు 24 గంటల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్ చీఫ్‌ స్పెషల్ సెక్రటరీ హాజరయ్యారు.

కరోనా దెబ్బ, జనావాసం వదిలి చెట్టుమీద నివాసం ఉంటున్న లాయర్

ఇక పంటలు చేతికొచ్చి కోయాల్సిన సమయంలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. ఈదురు గాలులతో కూడిన వాన రైతుల్ని అతలాకుతలం చేసింది. వందల ఎకరాల్లోని పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గుంటూరులో 2, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 363కు చేరింది.