Corona in Andhra Pradesh: ఏపీలో కర్ప్యూ సమయం సడలింపు, స్కూళ్లల్లో కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు, కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో తాజాగా 1,063మందికి కరోనా పాజిటివ్
దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,95,669కు చేరింది. మరోవైపు 1,929మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,65,657 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Amaravati, August 17: ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,063మందికి పాజిటివ్ (Corona in Andhra Pradesh) వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,95,669కు చేరింది. మరోవైపు 1,929మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,65,657 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున కన్నుమూశారు. అనంతపురంలో ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 13,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,341 యాక్టివ్ కేసులున్నాయి.
సీఎం వైఎస్ జగన్ మంగళవారం కోవిడ్ నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని.. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగించాలన్నారు. పాఠశాలలు తెరిచినందున అక్కడ కొవిడ్ నిబంధనలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పాఠశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని.. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించేలా చూడాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఖాళీలను 90 రోజుల్లో భర్తీ చేయాలన్నారు. ఎక్కడా సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని.. వైద్య సేవలు అందడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమర్థమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం రెండు కొత్త వెబ్‌సైట్లు తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.
ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూళ్లలో కోవిడ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. థర్డ్‌వేవ్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉంటుందని చెప్పారు.వివాహ కార్యక్రమాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కోవిడ్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదని చెప్పారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సమర్థవంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలనకోసం రెండు కొత్త వెబ్‌సైట్లు డిజైన్ చేసినట్లు సమావేశంలో సీఎం జగన్ తెలిపారు.