AP EAPCET 2021: ఏపీలో ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు, సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ‌, ఫార్మసీ పరీక్షలు, ఏపీఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షషెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ
AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

ఏపీలో ఇంజనీరింగ్‌, వ్యవసాయ‌, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) షెడ్యూల్‌ (AP EAPCET 2021) విడుదలైంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్‌టీయూకు అప్పగించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Adimulapu Suresh) తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు (AP EAPCET 2021 EXams) దరఖాస్తు చేసుకున్నారని, కరోనా పాజిటివ్‌ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్‌టీయూకు విద్యా శాఖ అప్పగించింది. జూన్‌ 25న ఏపీఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల నమోదు పక్రియను జూన్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించింది. మౌలిక సదుపాయాల అందుబాటు, కొవిడ్-19 మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలను 16 సెషన్లలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

టీచర్‌ కమ్ స్టూడెంట్‌గా మారిన ఏపీ సీఎం వైయస్ జగన్, గ్రీన్‌ బోర్డుపై ఆల్‌ ద వెరీ బె​స్ట్‌ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి, స్కూల్లో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్న సీఎం

ఇందులో 10 సెషన్లు ఇంజినీరింగ్.. ఆరు సెషన్లు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ పరీక్ష రద్దు చేసిననందున ఈఏపీసెట్‌ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈఏపీసెట్‌-2021 పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజినీరింగ్, 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటినీ ఎంచుకున్నారు.