Parimal Nathwani Meets AP CM: సీఎం జగన్‌తో పరిమల్ నత్వానీ, రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (Parimal Nathwani Meets AP CM) కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.
Amaravati, Mar 10: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (Parimal Nathwani Meets AP CM) కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం నత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తానని అన్నారు. కాగా, నత్వానీ బుధవారం ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Here's His Tweet
అంతకు ముందు నత్వానీ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నత్వాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించినా ముందుండి పూర్తిచేస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు.
గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం వల్లనే తనకు మూడోసారి రాజ్యసభకు వెళ్లే అరుదైన అవకాశం దక్కిందన్నారు.తనకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ ఎంపీలతో కలిసి టీమ్ వర్క్ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని' ఎంపీ నత్వానీ వెల్లడించారు.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్
ఏపీ నుంచి పెద్దల సభకు నామినేట్ చేసిందుకు సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిమల్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తాను’ అని పోస్ట్ చేశారు.
Here's His Tweet
కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నత్వానీతో పాటు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తు, పంతొమ్మిది రాజకీయ పార్టీలకే గుర్తులు
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో పార్టీ ముఖ్యనేతలో చర్చించిన అనంతరం పరిమల్‌ను పెద్దల సభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)