Rajya Sabha Elections: ఏపీలో ఫలించిన అంబానీ వ్యూహం, ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు పేర్లు బయటకు వచ్చేశాయి, వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వర ప్రసాద్
ysrcp-announces-names-of-4-candidates-for-rajya-sabha-polls (Photo-Twitter)

Amaravati, Mar 09: దేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు (Rajya Sabha election) జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగే రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఇక ఏపీలో (AP ) ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలను (AP Rajya Sabha) అధికార వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధిష్టానం (YSRCP) ఖరారు చేసింది.

గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు

ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లతో పాటు అయోధ్య రామిరెడ్డిల పేర్లను వైసీపీ ఎంపిక చేసింది. ఇక నాలుగో సీటు పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానికి వైసీపీ కేటాయించినట్లుగా తెలుస్తోంది. మండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపుతోంది.

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి ఒక సీటు కేటాయించారు. కాగా 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు తుది గడువు విధించారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

17 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

టీడీపీకి డొక్యా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై, వైసీపీ తీర్ధం

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్యా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికకు తాడేపల్లిలోని జగన్ నివాసం వేదికైంది. ఈ సందర్భంగా డొక్కాకు వైసీపీ కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన పార్టీ మారిన సంగతి తెలిసిందే.

ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇవాళ ఉదయమే సుధీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డొక్కా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అధిష్ఠానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కార్యకర్తలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు.

శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైఎస్సార్‌సీపీకి మానసికంగా దగ్గరయ్యానని..అయితే వైఎస్సార్‌సీపీ నాయకత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైసీపీలో చేరిక 

గతేడాది చివర్లో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ, సీఎం జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు.​ విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని గెలిచేందుకు ధీమా వ్యక్తం చేశారు.