Amaravati, Mar 06: 2020 రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ (Rajya Sabha Elections Notification) విడుదల చేశారు. మార్చి 6 నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు
అయితే నామినేషన్లకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ కోసం 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాల్సి ఉండగా, స్వతంత్రులు 10 మంది ఎమ్మెల్యేలను ప్రతిపాదకులుగా చేయాల్సి ఉంటుంది. ఏపీ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ అలీ ఖాన్, టీ సుబ్బిరామిరెడ్డి, కే కేశవరావు, తోట సీతారామ లక్ష్మిల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం రానుంది. వీరి పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9న ముగుస్తోంది.
కాగా మంత్రులు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పారిశ్రామికవేత్త అయోధ్య రామి రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నథ్వానీ, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్ రావుల పేర్లను సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇది పార్లమెంటు..బజారు కాదు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం
అలాగే తెలంగాణలో (Telangana) కూడా రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వినోద్, కడియం శ్రీహరి ల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక జార్ఖండ్‌లో 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ సీట్లలో ఒకటి జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) చీఫ్ శిబు సోరెన్‌కు వెళ్లడం దాదాపు ఖాయం అయింది. రెండవ సీటుపై ఇంకా క్లియర్ సమాచారం రాలేదు.
రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వనున్న రాష్ట్రాలు మరియు సీట్లు
మహారాష్ట్ర - 7 , ఒడిశా - 4 , తమిళనాడు - 6, పశ్చిమ బెంగాల్ - 5, ఆంధ్రప్రదేశ్ - 4, తెలంగాణ - 2, అస్సాం -3, బీహార్- 5, ఛత్తీస్‌గడ్ - 2 , గుజరాత్ -4, హర్యానా - 2, హిమాచల్ ప్రదేశ్ -1, జార్ఖండ్ - 2, మధ్యప్రదేశ్ - 3, మణిపూర్ - 1, రాజస్థాన్ - 3, మేఘాలయ - 1