AP Coronavirus Update: ఆ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు, ఏపీలో మరో 10376 కొత్త కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 1,38,038కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, 1,349కి పెరిగిన మృతుల సంఖ్య

జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో ఇప్పటిదాకా 14,699 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఇప్పటిదాకా 10,379 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 20,395 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఇప్పటిదాకా 14,669 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఇప్పటిదాకా 16,847 కేసులు నమోదయ్యాయి.విశాఖపట్నంలో ఇప్పటిదాకా 10,765 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 12,310 కేసులు నమోదయ్యాయి

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, July 31: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్‌ పరీక్షించగా 10,376 మంది కరోనా పాజిటివ్‌గా (AP Coronavirus Update) నిర్ధారణ అయ్యారు. గత 24 గంటల్లో 68 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య (coronavirus cases) 1,38,038కి చేరగా మృతుల సంఖ్య (coronavirus Deaths in AP) 1,349కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ నుంచి కోలుకుని 3,822 మంది డిశ్చార్‌ అయ్యారు. మూడు రాజధానులకు సై, రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌

దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 60,969 కి చేరింది. ప్రస్తుతం 75,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలోని 13 జిల్లాలకు గానూ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో ఇప్పటిదాకా 14,699 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఇప్పటిదాకా 10,379 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 20,395 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఇప్పటిదాకా 14,669 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఇప్పటిదాకా 16,847 కేసులు నమోదయ్యాయి.విశాఖపట్నంలో ఇప్పటిదాకా 10,765 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 12,310 కేసులు నమోదయ్యాయి ప్లాస్మా ఇస్తే రూ.5వేల ప్రోత్సాహక నగదు, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ సీఎం వైయస్ జగన్‌, ప్రతి ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్టులో బెడ్ల వివరాలు ఉండాలని ఆదేశాలు

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు మాత్రమే అనుమతించారు. నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో కొత్త లాక్‌డౌన్ నిబంధనలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డ సీఐ బీబీ రవికుమార్‌లు వెల్లడించారు. కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి, విషాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

ఇక కరోనా విషాద ఘటనలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి సప్తగిరి కాలనీకి చెందిన కట్టమంచి సుబ్రహ్మణ్యం అతని కొడుకు శేఖర్ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు గురువారం (జులై 30,2020) తిరుపతిలోని అలిపిరి లింకు బస్టాండులోని సంజీవనీ బస్సు దగ్గరకొచ్చారు. అప్పటికే పరీక్షలు చేయించుకోవటానికి వచ్చినవారితో పెద్ద క్యూ ఉంది. దీంతో ఆ లైన్ లోనే శేఖర్ నిలబడ్డాడు. గంటన్నర తరువాత స్వాబ్స్ ఇచ్చారు. ఏపీలో సరికొత్త పథకం, విద్యా వారధి మొబైల్‌ వాహనాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి జిల్లాలోని విద్యార్థులకు వీటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

రిజల్ట్స్ మెసేజ్ పంపిస్తామని చెప్పటంతో తండ్రీ కొడుకులు ఇంటికెళ్లటానికి బయలుదేరారు. అంతలోనే శేఖర్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. 108 కాల్ చేయగా 45 నిమిషాలకు వచ్చింది. రుయాలోని ఎమర్జన్సీ వార్డుకు తరలించారు. కానీ అప్పటికే శేఖర్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.తరువాత శేఖర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కరోనా పరీక్షలు చేయించుకోవటానికి వచ్చిన కొడకు కళ్లముందే నేలరాలిపోవటాన్ని ఆతండ్రి తట్టుకోలేకపోయాడు. భోరుభోరున ఏడ్చాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif