AP capital: high-power-committee-Third-meeting-for-ap-development (File pic)

Amaravati, July 31: ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు (AP Decentralisation Bill) గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. దీంతోపాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన (governor biswabhusan harichandan) ఆమోదించారు. దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది. వివాదాల నడుమ ఏపీ ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ నియామకం, అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి నియామకం

పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను (three capitals bills) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) నిర్ణయించిన విషయం తెలిసిందే. రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్‌ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. ప్లాస్మా ఇస్తే రూ.5వేల ప్రోత్సాహక నగదు, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ సీఎం వైయస్ జగన్‌, ప్రతి ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్టులో బెడ్ల వివరాలు ఉండాలని ఆదేశాలు

కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్‌ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్‌ అయ్యింది. గవర్నర్‌ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.