AP Three Capitals Row: ఏపీలో మూడు రాజధానులపై సందేహం లేదు, ఏర్పాటు ఖాయం, అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని తెలిపిన మంత్రి కురసాల కన్నబాబు
kurasala kannababu (Photo-Twitter)

Amaravati, August 9: ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 3 రాజధానులు (AP Three Capitals Row) ఏర్పాటు కావడం ఖాయమని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఉద్యమం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన (minister kurasala kannababu) విలేకరులతో మాట్లాడారు.

600 రోజుల పండుగ, వెయ్యి రోజుల పండగల వంటి కార్యక్రమాలతో అక్కడి ప్రజలను మోసం చేయవద్దు. కచ్చితంగా మూడు రాజధానులు (Three capitals process ongoing) ఉంటాయి. చంద్రబాబు రైతుల నుంచి భూములను లాక్కుని పప్పుబెల్లంలా పంచాడు. చంద్రబాబు, లోకేశ్ హైదరాబాదులో కూర్చుని ఏపీలో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీరు చేస్తే ఉద్యమాలు... దళితులు చేస్తే అల్లరి మూకలా? చంద్రబాబు బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు పోరాటం రియల్ ఎస్టేట్ కోసమైతే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ పాటు పడుతున్నారు. మట్టి, నీరు తెచ్చి పండుగ చేసే ప్రభుత్వం కాదు మాది... సీఎం జగన్ (Chief Minister Y.S. Jagan Mohan Reddy) ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది" అని కన్నబాబు (Agriculture Minister K. Kannababu) స్పష్టం చేశారు.

టీటీడీ చైర్మన్‌గా మరోసారి వై.వి.సుబ్బారెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, టీటీడీ బోర్డు సభ్యుల నియామకం త్వరలో జరిగే అవకాశం

తమకు కావాల్సిన చోట అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు. గ్రాఫిక్స్‌, డిజైన్లు, మట్టి, నీళ్లు, శంకుస్థాపనలతో అయిదేళ్లు కాలయాపన చేశారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టినా, వారు వైకాపా పక్షానే నిలబడ్డారు. రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గంలోనూ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు గెలిచారు. అమరావతి ఉద్యమకారులపై లాఠీఛార్జి జరిగిందని, వ్యానులో కుక్కేశారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

జాతీయ విపత్తు చట్టం, 144 సెక్షన్‌ అమల్లో ఉంది. అనుమతులు ఇవ్వలేమని పోలీసులు చెప్పారు. అయినా కొందరిని ముందుపెట్టి రాజకీయంగా డ్రామాలు ఆడిస్తున్నారు.మూడు రాజధానులకు మద్దతిచ్చే దళిత సంఘాలు ర్యాలీ చేస్తామంటే దానిని అల్లరి మూకల పోటీ ఉద్యమన్నారు. దీనిపై బేషరతుగా క్షమాణ చెప్పాలి. అమరావతిలో సంపద సృష్టించుకోవాలనుకున్న కలలు చెల్లాచెదరవుతున్నాయనే ఆవేదన చంద్రబాబులో ఉంది.

కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేం, కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం, మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి

శ్రీకాకుళానికి చెందిన అచ్చెన్నాయుడికి విశాఖలోని పరిపాలన రాజధానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత లేదా? ఆయన టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడా, అమరావతికి అధ్యక్షుడా? విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రలో నాలుగైదు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని యనమల రామకృష్ణుడికి తెలియదా? అమరావతి నుంచి 139 ప్రాజెక్టులు వెళ్లిపోయాయంటే.. అటువంటి సామర్థ్యంలేని సంస్థలకు గత ప్రభుత్వం భూములను పంచింది. ఆ ప్రాజెక్టులను ఆపాలని ఈ ప్రభుత్వం చెప్పలేదని కన్నబాబు పేర్కొన్నారు.