టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికే మరలా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
అయితే కొత్త చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన ఏపీ ప్రభుత్వం.. పాలకమండలి సభ్యులను మాత్రం ప్రకటించలేదు. 37 మంది బోర్టు సభ్యుల నియామకం త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. వీరిలో ఇతర రాష్ట్రాల వారిని కూడా నియమించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవి. సుబ్బారెడ్డి.
YV.Subbareddy is appointed as Chairman of TTD for the second term.
Wish you all the best @yvsubbareddymp sir. pic.twitter.com/g3ZQT8tvKV
— 🇮🇳 Venkatesh Nagillaవెంకటేష్ నాగిళ్ల (@Venkatjourno) August 8, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)