AP Coronavirus Updates: ఏపీలో లక్షా ఎనభై వేలు దాటిన కోవిడ్ డిశ్చార్జ్ కేసుల సంఖ్య, రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ రద్దు, ఏపీలో తాజాగా 8,943 కేసులు, ప్లాస్మా దానం చేయాలని కోరిన గవర్నర్

దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,70,190కు చేరింది. తాజాగా 9,779 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి‌వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 1,80,703కు చేరుకుంది. తాజాగా వైర‌స్ బాధితుల్లో 97 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం మృతుల సంఖ్య 2475గా (Coronavirus Deaths) ఉంది. ప్ర‌స్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో (AP Medical Health Department) పేర్కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది.

Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

Amaravati, August 14: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 53,026 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు (AP Coronavirus) జ‌ర‌ప‌గా 8,943 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,73,085కు చేరింది. తాజాగా 9,779 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి‌వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 1,80,703కు చేరుకుంది.

తాజాగా వైర‌స్ బాధితుల్లో 97 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం మృతుల సంఖ్య 2475గా (Coronavirus Deaths) ఉంది. ప్ర‌స్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో (AP Medical Health Department) పేర్కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు, ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ ఘటన

స‌్వ‌ర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంతో ప‌ది మంది రోగుల ప్రాణాలు కోల్పోవ‌డానికి కార‌ణ‌మైన ర‌మేష్ ఆస్ప‌త్రిపై (Ramesh Hospital) ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌భుత్వ నిబంధనలకు‌ విరుద్దంగా కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు శుక్ర‌వారం కమిటీ నివేదిక వెల్ల‌డించింది. దీంతో ర‌మేష్ ఆస్ప‌త్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజ‌య‌వాడ ఎంజీ రోడ్‌లోని డాక్ట‌ర్ ర‌మేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ప‌త్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందిన‌ట్లు గుర్తించారు. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి అంటున్న పరిశోధనలు, దేశంలో తాజాగా 64,553 మందికి కోవిడ్-19, 24,61,191కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Here's AP Corona Report

కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంటుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు అపారమైన నష్టాన్నికలిగించింది. సాధారణ జన జీవన విధానానికి భంగం కలిగించింది. అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నానని తెలిపారు.