Dogs Eat Patient's Dead Body: శవాన్ని పీక్కుతిన్న కుక్కలు, ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ ఘటన, వీడియోని షేర్ చేసిన చంద్రబాబు, స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు
Dogs Ate Patient Dead Body (Photo-Video Grab)

Amaravati, August 13: ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సబ్బంది ( GGH Staff) పట్టించుకోలేదు. దీంతో చివరకు ఈ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు (Dogs Ate Patient Body)వార్తలు గుప్పుమన్నాయి. ఈ దారుణ ఘటనపై ట్విట్టర్‌ వేదికగా మంగళవారం తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సిబ్బంది పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ముమ్మాటికీ మనుషుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా అగౌరవ పరచటమే. ఈ దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ దారుణాన్ని ఖండించేందుకు కూడా నాకు మాటలు రావట్లేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని జీజీహెచ్ లో (Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS)ఓ మనిషి మృతదేహం నిరాశ్రయుల ఆశ్రయం కోసం ఉపయోగించిన షెడ్లో పడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సోమవారం, ఆసుపత్రి భద్రతా సిబ్బంది కుక్కలు చనిపోయిన మనిషి చెవులను కొరుకుతున్నట్లు గమనించి, వాటిని తరిమికొట్టారు. కరోనాపై ఊరట..ఏపీలో లక్షా అరవై వేలకు పైగా డిశ్చార్జ్ కేసులు, తాజాగా 9,597 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,54,146కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 

ఆస్పత్రి సిబ్బంది ఆ డెడ్ బాడీని కాంతారావుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని మరణంపై ఆగ్రహించిన బంధువులు రిమ్స్ వైద్య నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి అతనిని చేర్చుకోవడానికి నిరాకరించిందని పేర్కొన్నారు.

Here's Babu Tweet

అయితే ఈ వాదనలపై స్పందించిన సూపరింటెండెంట్, కాంతారావుకు ఆసుపత్రిలో ప్రవేశం నిరాకరించబడిందా, లేదా అతను చికిత్స నిరాకరించి ఆసుపత్రి ప్రాంగణంలో ఆశ్రయం పొందాడా అనే దానిపై విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. "మా రికార్డుల ప్రకారం, కాంతారావును ఆసుపత్రిలో చేర్చలేదు. పేషెంట్‌గా అతని గురించి ఎటువంటి రికార్డులు లేవు. కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన తరువాత అతన్ని ఆగస్టు 5 న అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ అతను పాత క్యాంటీన్ షెడ్‌లో ఉంటున్నాడు. ఇక్కడ రిజిస్టర్ అయిన పేషెంట్లను మాత్రమే ట్రీట్ చేస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు

ఇక ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా రోగి మృతదేహాన్ని పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. జరిగిన వాస్తవాన్ని అధికారులు వెల్లడించారు. రాధాకృష్ణారెడ్డి అనే పేషెంట్‌ కోవిడ్ లక్షణాలతో మార్కాపురం కోవిడ్ ఆస్పత్రిలో చేరారని, అక్కడ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడని అధికారులు తెలిపారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించామని, అక్కడ వార్డుకు తరలించే సమయంలో మూడో ఫ్లోర్ నుంచి దూకేశాడని వివరించారు. వైద్యులు పరీక్షించగా రాధాకృష్ణారెడ్డి చనిపోయినట్లుగా తేలిందని.. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని అధికారులు వివరించారు.