Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, August 14: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా (Coronavirus New Cases) 64,553 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య (India's Coronavirus Report) 24,61,191కు చేరింది. ఇక దేశంలో నమోదవుతున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 1007 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తం 48,040 మంది ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. గురువారం తాజాగా 55,573 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 6,61,595 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 17,51,556 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 8,48,728 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 2,76,94,416 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు.

మహారాష్ట్రలోని జైళ్లలో 1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో 814 మంది ఖైదీలు, 268 మంది జైలు ఉద్యోగులు కోలుకున్నారని మహారాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు చెప్పారు. కరోనా సోకిన ఆరుగురు ఖైదీలు మరణించారని అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో అత్యధికంగా 66,999 కరోనా కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర జైళ్లలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఆయా జైళ్లను శానిటైజ్ చేయడంతోపాటు కరోనా సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ఇంజెక్షన్ ధర రూ. 2,800, మార్కెట్లోకి యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్‌ను విడుదల చేసిన జైడస్ కాడిలా

కర్ణాటకలో గడిచిన 24గంటల్లో కొత్తగా 6,706 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 2,03,200కు చేరాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన బులిటెన్ ప్రకారం.. 78,337 క్రియాశీల కేసులు ఉండగా, ఇవాళ 8,609 మంది రోగులు డిశ్చార్జి కాగా, మొత్తం 1,21,242 మంది కోలుకున్నారు. తాజాగా 103 మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 3,613కు చేరింది. కాగా, దేశంలో ఒకే రోజు కొత్తగా 66,999 కేసులు నిర్ధారణ కాగా, గత 24గంటల్లో 942 మంది మరణించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. 6,53,622 క్రియాశీల కేసులుండగా, 16,95,982 మంది డిశ్చార్జి అయ్యారు. 47,033 మంది మరణించగా.. ఇప్పటి వరకు 23,96,638 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు, ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ ఘటన, వీడియోని షేర్ చేసిన చంద్రబాబు, స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు

ఇదిా ఉంటే కరోనా వైరస్‌ 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నా వ్యాపిస్తుందని అధ్యయనంలో తేలింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడే, అరిచినప్పుడే కాదు, సాధారణంగా మాట్లాడినప్పుడు కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు చెబుతున్నారు. నోట్లోంచి వచ్చే తుంపరల ద్వారా కరోనా వైరస్‌ బయటకు వస్తోందని, వ్యాధి బారిన పడేయడమే కాకుండా కణాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింంటున్నారు. అందుకే 6 అడుగుల భౌతిక దూరం వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు సరిపోదన్న విషయాన్ని తమ పరిశోఽధనల్లో గుర్తించామని వారు వెల్లడించారు. దాంతో వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే విషయాన్ని అంగీకరించాలని డబ్ల్యూహెచ్‌వోను కోరారు.