Nandyal Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, కల్వర్టును ఢీకొట్టిన స్కార్పియో వాహనం, ముగ్గురు మృతి, ఎన్టీఆర్ జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (Nandyal Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును స్కార్పియో వాహనం (Jeep hits culvert in Nandyal) ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి (Three dead) చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు
Nandyal, April 18: ఏపీలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (Nandyal Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును స్కార్పియో వాహనం (Jeep hits culvert in Nandyal) ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి (Three dead) చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మృతులను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వారిగా గుర్తించారు. బేతంచెర్ల మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కడప జిల్లా మైదుకురు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు వెంకటేశ్వర్లు, స్వరాజ్యం, విజయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో పరువుహత్య కలకలం, కూతుర్ని ప్రేమించినందుకు మాజీ హోంగార్డును హత్య చేయించిన మామ, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఇక ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పరిటాల బైపాస్ వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి అనంతరం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై ట్రావెల్స్‌లో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబనికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా యానాం-ఎదుర్లంక బాలయోగి వంతెనపై ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న భార్యాభర్తలు, కుమారుడు మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు అమలాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆలూరు, గుంతకల్లు పట్టణానికి చెందిన వారు కసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకుని మురుడి, నెమకల్లు దేవాలయాలకు వెళుతూ జాతీయ రహదారిపై ఆగారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆగి ఉన్న తూఫాను వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంతకల్లులో ప్రాథమిక చికిత్స తర్వాత కొందరిని అనంతపురం, మరికొందరిని కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.