IPL Auction 2025 Live

AP Local Body Elections: ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదే, స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం

ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP Election Commission) జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

Supreme Court of India |(Photo Credits: IANS)

Amaravati, Mar 18: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై (Local Body Elections PostPoned) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP Election Commission) జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం (Supreme Court) విచారణ చేపట్టింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ (Election Code) వెంటనే ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కచ్చితంగా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని వెల్లడించింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పింది. సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్టయింది.

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్రంలో కోడ్‌ కొనసాగింపును ప్రభుత్వం ప్రశ్నించింది. కోడ్‌ అమల్లో ఉందని చెప్తూ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్‌ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడాన్ని ఆక్షేపించింది.

ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి

ఎన్నికల నిర్వహణపై ఈసీ కచ్చితంగా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని వెల్లడించింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వాయిదాపై ఏపీ ప్రభుత్వ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదేనని స్పష్టం చేసింది.