Supreme Court of India | Photo-IANS)

Amaravati, Mar 17: ఏపీ ఎన్నికల కమిషన్ (Andhra Pradesh State Election Commission) తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ( AP Local Body Elections Postponed) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం గడప తొక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని కిషన్‌ సింగ్‌ తోమర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించిందని పిటిషన్‌లో పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ఇ, 243 యు నిర్దేశించిన ప్రకారం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీన్ని గౌరవించలేదని నివేదించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి

రోజువారీ పాలనతోపాటు కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పిటిషన్‌లో తెలిపింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్‌ను అత్యవసరంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది జి.ఎన్‌.రెడ్డి అభ్యర్థించారు. దీన్ని విచారణ జాబితాలో చేర్చాలని ధర్మాసనం రిజిస్ట్రీకి సూచించింది.

ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎలాంటి ప్రాతిపదిక లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడమే కాకుండా 2006లో కిషన్‌సింగ్‌ తోమర్‌ వర్సెస్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన మీదట మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయవచ్చని ఆ తీర్పులో సుప్రీం పేర్కొంది.

మార్చి 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కేవలం అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తరువాతే ప్రక్రియను నిలిపివేయవచ్చని సుప్రీం కోర్టు ఆ కేసులో స్పష్టం చేసింది. ప్రతివాది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చ జరపకుండానే నోటిఫికేషన్‌ జారీ చేసిందని తన పిటిషన్ లో పేర్కొంది.

ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్చి 15నే కోరినప్పటికీ ప్రతివాది పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం సమర్థనీయం కాదు. అందుకే ఈ నోటిఫికేషన్‌ను పక్కనపెట్టాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరింది.