Kanakadurga Flyover: విజయవాడ వాసుల కష్టాలు తీరినట్లే, తుది దశలో కనక దుర్గ ఫ్లైఓవర్ పనులు, ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్, ఆ తరువాత వాహనాలకు అనుమతి
ఈ ఫ్లైఓవర్ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరు-ఏప్రిల్ మొదటివారంలోగా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Vijayawada, Febuary 23: బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం (Kanaka Durga Flyover) తుదిదశకు చేరుకుంది. ఈ ఫ్లైఓవర్ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరు-ఏప్రిల్ మొదటివారంలోగా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వేలానికి సుజనా చౌదరి, రాయపాటి ఆస్తులు
ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత అనధికారికంగా ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు అనుమతివ్వాలని యోచిస్తున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.
విజయవాడ (Vijayawada) భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉంటోంది. రూ.325 కోట్ల వ్యయంతో , 2.6 కిలోమీటర్ల మేర సోమా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. 2015 డిసెంబర్ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది.
ఆస్తుల వివరాలను వెల్లడించిన మాజీ సీఎం
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఏర్పాటు అయిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయి. గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే స్పాన్లు, వింగ్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కనకదుర్గ అమ్మవారి గుడి కొండపైకి వెళ్లే ప్రవేశ ద్వారానికి ఎదురుగా జరుగుతున్న రెండు స్పాన్ల పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి.
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వై డక్ట్, రాజీవ్‌గాంధీ పార్క్ వైపు అప్రోచ్ రోడ్ల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ పనులు కూడా నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు.. ఫ్‌లైఓవర్‌కు ఇప్పటికే అందమైన రంగులు అద్దారు. వంతెనపై విద్యుద్దీపాల ఏర్పాటు 75 శాతం పూర్తయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ రెండ్రోజుల క్రితం కాంట్రాక్టరు ప్రతినిధులు, సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కనకదుర్గ ఫ్‌లైఓవర్ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
బాబుకు జడ్ ప్లస్ భద్రత ఇస్తున్నాం
రాజీవ్‌గాంధీ పార్క్ నుంచి సగం వరకు ఫినిషింగ్ వర్క్ పూర్తయిందని, భవానీపురం వైపు పనులు సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ వంతెన పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ సూపరింటెండింగ్ ఇంజినీర్ (క్వాలిటీ కంట్రోల్) జాన్‌మోషే వివరించారు. చివరి దశలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులో పూర్తవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.