YSRCP Leaders vs Pawan Kalyan: ప్యాకేజీ తీసుకుని పక్కకు వెళ్లి ఆడుకో, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన వైసీపీ నేతలు, రెండుసార్లు ఓడిపోయిన నువ్వా మాట్లాడేది అంటూ ఫైర్
ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్ కల్యాణ్ ముందే ఒప్పేసుకున్నాడంటూ కామెంట్ చేశారు ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్,
VJY, Jan 13: శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్ కల్యాణ్ ముందే ఒప్పేసుకున్నాడంటూ కామెంట్ చేశారు ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్. ఐటీ శాఖ మంత్రి పేరు నీకు తెలియదు. కనీసం భార్యల పేర్లైనా గుర్తున్నాయా?.. గుర్తుపెట్టుకోవాలి కదా!. బహుశా ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు పేరు మినహా ఎవరి పేరు నీకు గుర్తుండదేమో?’’ అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ.
కాపుల కులాన్నంతా మూట కట్టి తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేద్దామనే ఆలోచన ఏమో నీది. వైఎస్ఆర్‌సీపీ తప్ప బీజేపీ , సీపీఐ, సీపీఎం , బీఎస్పీ తో పాటు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్. ఈసారి నీ బెండు తీయడం ఖాయం. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసేసుకో.. ఇవ్వాల్సిన అందరికీ భరణాలు ఇచ్చేసేయ్’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మంత్రి అంబటి. ‘నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి’ అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.పీకే అంటే పిచ్చి కుక్క అని, పవన్.. చంద్రబాబు జోకర్‌వి అని విమర్శించారు మంత్రి అంబటి. ఇక పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా మండిపడ్డారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండుసార్లు ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అంటూ ఘాటుగా స్పందించారు. గురవారం నాటి సభలో వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రులను పవన్ విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయి విమర్శలు చేశారు పవన్.
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు: రాష్ట్రంలోని 175 సీట్లలో ఒంటరిగా చేస్తానని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్‌కు ఉందా? అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. శ్రీకాకుళం యువశక్తి సభలో జనసేనాని చేసిన ప్రసంగంపై సాక్షి టీవీతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది తీవ్రంగా స్పందించారు. పవన్ యువశక్తి సభలో అసభ్యంగా మాట్లాడాడు.
సీఎం జగన్‌ను విమర్శించే అర్హత అసలు పవన్‌కు ఉందా?. సజ్జల , మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఉందా?.. బాంచన్ దొర అంటూ చంద్రబాబు కాళ్ల దగ్గర చేరావు. ఊడిగం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చావు’ అని మల్లాది మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఎవడితో ఉంటావో తెలియని నువ్వు.. ఎవరితో పోరాటం చేస్తావు?. జనసేన , వీర మహిళలను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టాడు. తన సభకు వచ్చిన అభిమానులను , జనసేన శ్రేణులను పవన్ అవమానిస్తూ వస్తున్నాడు. రెండు చోట్ల ఓడిపోయింది నిజం కాదా?. మంత్రి రోజా మాట్లాడిన మాటల్లో తప్పేముంది?’ అని ఎమ్మెల్యే మల్లాది మండిపడ్డారు.
మంత్రి సీదిరి అప్పలరాజు: చంద్రబాబు నాయుడు స్క్రిప్టు ప్రకారమే నడుస్తున్న పవన్ కల్యాణ్.. ఎంతసేపు ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాజకీయం అంటే ఎంత సేపు ఊడిగం చేయడం కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. నాయకుడు అంటే కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాలే కానీ, ప్యాకేజీ మాటాలు మాట్లాడకూదని సీదిరి ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం) ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మంత్రి అప్పలరాజు.. పవన్ కల్యాణ్ సభలకు పేర్లు కూడా టీడీపీనే నిర్ణయిస్తుందన్నారు.చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం వాళ్లు ఏది చెబితే పవన్ కల్యాణ్ అది చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభలకు పేర్లుఉ కూడా టీడీపీ నిర్ణయిస్తుంది. మత్స్యకారుల గురించి పవన్‌కు అవగాహన ఉంది. టీడీపీ హయాంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టలేదు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు: ఉత్తరాంధ్ర బాగుపడటం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదనే విషయం నిన్నటి సభ ద్వారా మరోసారి అర్ధమైందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసలు పవన్ మాటలకు చేతలకు పొంతనే లేదని ధర్మాన విమర్శించారు.ఈరోజు (శుక్రవారం) మాట్లాడిన ధర్మాన.. ‘ ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా?, పవన్ మాటలకు చేతలకు పొంతన లేదు. ప్రజా నాయకులు హుందాగా ఉండాలి. పుస్తకాలు చదవడం కాదు.. అందులో ఉండే భావజాలాన్నిఅర్థం చేసుకోవాలి.
అమరావతిలో రాజధాని అనేది రియల్టర్ల కోసమే. విశాఖ రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆస్పత్రి ఏర్పాటు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మ గౌరవంగా ఉండేలా సీఎం జగన్ పాలన.’ అని మంత్రి ధర్మాన తెలిపారు.
మంత్రి ఆదిమూలపు సురేష్: చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అని తేలిపోయిందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని, అంటే బాబు కోసమే పవన్ కల్యాణ్ అనే విషయం అర్థమైపోయిందని ఆదిమూలపు పేర్కొన్నారు. ‘ ప్యాకేజీ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరు.వైఎస్సార్‌సీపీతో పోటీ చేసేంత సీన్ పవన్‌కు లేదు. మహిళా మంత్రులపై అసభ్యంగా మాట్లాడటం దారుణం. జగన్‌తో పోరాడటం చేతకాదని పవన్ ముందే ఒప్పుకున్నాడు.
మంత్రి జోగి రమేష్ : పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.పవన్ ఒక ప్యాకేజీ స్టార్ మాత్రమేనని, చంద్రబాబును కలిసి సంక్రాంతి ప్యాకేజీ మాట్లాడుకున్నారన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదని పవన్ ముందే తేల్చిచెప్పాడని, పవన్, చంద్రబాబు, లోకేష్ ఎన్నిసాన్లు దండాలు పెట్టినా 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయమన్నారు మంత్రి జోగి రమేష్. కుప్పంలోనూ చంద్రబాబును ఓడిస్తామన్నారు మంత్రి. అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత తమదని జోగి రమేష్ మరోసారి పేర్కొన్నారు.
మంత్రి దాడిశెట్టి రాజా: ఎప్పుడో చచ్చిపోయిన చంద్రబాబు పార్టీని బతికించటానికి పవన్ కల్యాణ్ తెగ ఆరాటపడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. బలమైన కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా పవన్ దూషణలకు దిగాడని మండిపడ్డారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పాడని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు కాపులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నేత అని, అలాంటి వ్యక్తిని కూడా దూషించడం సరికాదన్నారు. పవన్ చేసే జోకర్ చేష్టలు, బ్రోకర్ చేష్టలన్నీ చూసి కాపులంతా అసహ్యించుకుంటున్నారు. తన సభలకు వచ్చే యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టేలా చేస్తున్నారు. ‘నిన్ను నమ్మి వస్తే.. పోలీసులపై తిరగపడమని అనటం ఏంటి?. వారు కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు నాశనం చేసుకోవాలా?.
నిన్ను చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. నీ దత్తతండ్రి ఇచ్చే స్క్రిప్టు చదివితే సరిపోతుందా?. సంవత్సరానికి 15 వేల కోట్ల పెట్టుబడులు ఈ మూడేళ్లలో గ్రౌండ్ అయ్యాయి. అలాంటివి నీ కళ్లకు కనపడవా?. రాష్ట్రంలో అలజడులు సృష్టించటానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నాసిరకం సినిమాలు తీసి అవి ప్లాప్ అయితే.. ప్రజలను తిట్టడం ఏంటి?. కాంతారా లాంటి సినిమాలు హిట్ అవుతుంటే నీ భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయో అర్థం చేసుకో. పవన్ ఎంతమందితో వచ్చినా వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.175 స్థానాల్లో గెలిచి తీరుతామని దాడిశెట్టి రాజా ధీమా వ్యక్తం చేశారు.