AP Unlock 3.0 Guidelines: ఏపీలో అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ ప్రక్రియ, కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ఉండనుంది. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్‌లకు అనుమతినివ్వలేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్‌లు, జిమ్‌లకు నేటి నుంచి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది.

coronavirus lockdown (Photo Credits: IANS)

Amaravati, August 5: ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 3.0 అమలు (AP Unlock 3.0) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ఉండనుంది. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్‌లకు అనుమతినివ్వలేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్‌లు, జిమ్‌లకు నేటి నుంచి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది. బార్లకు నో పర్మిషన్, ఆగస్టు 31 వరకు విద్యా సంస్థల మూసివేత, రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ఎత్తివేత, అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు (AP Coronavirus Cases) పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు‌ పోడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరిష తెలిపారు. ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ ఉండనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉండేదని ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు లేని వారు పరీక్షలకు రావోద్దని ఈ సందర్భంగా కమిషనర్‌ సూచించారు. తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా, తదుపరి సమావేశాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర జల శక్తి శాఖ

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు

స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత

ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లకు అనుమతి

సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్స్‌, మెట్రో రైలు‌ మూసివేత కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది)

సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు

కంటైన్‌మెంట్‌ జోన్లలో అంక్షలు కొనసాగింపు

భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు.

సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది)

వీటికి అనుమతి..

రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేశారు.

జిమ్ లు, యోగా కేంద్రాలు ఆగస్ట్ 5 నుంచి తెరుచుకోవచ్చు.

భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు.

వీటికి అనుమతి లేదు..

కంటైన్మెంట్ జోన్లలో ఆగస్ట్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది.

స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంబంధ సంస్థలు ఆగస్టు 31 వరకు తెరువకూడదు.

మెట్రో రైళ్లు నడపడంపై నిషేధం కొనసాగుతుంది.

బార్లు ఎప్పటిమాదిరిగానే మూసివుంచాలి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif