Amaravati, August 5: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (Apex Council Meeting) కేంద్ర జలశక్తి శాఖ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరుకాలేనని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర జల శక్తిశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. త్వరలోనే మరో సమావేశం తేదీని తెలియచేస్తామని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోం! నదీ జలాల వాటాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష, తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని తీర్మానం
అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. ఈ రోజే కేబినెట్ మీటింగ్ ఉన్నందున తెలంగాణ సీఎం సమావేశానికి కాలేరని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో భేటీని వాయిదా వేస్తూ జలశక్తి రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
షెడ్యూల్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖకు అజెండాను పంపాలని నిర్ణయించింది. కాగా కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషమయంలో బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు (River water dispute) చేసుకున్నాయి. వీటిపై జూన్ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు జరిగాయి.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు ఆపాలని ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు
సీడబ్ల్యూసీ అనుమతి లేని వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని, వాటి డీపీఆర్‌లు ఇస్తే పరిశీలన, ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని బోర్డులు సూచించాయి. ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉంటారో లేదో తెలపాలని సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి గత నెల 28న లేఖ రాసింది.