IPL Auction 2025 Live

AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం, శాససమండలి ఉంటుందా..ఊడుతుందా..? మరికొద్ది సేపట్లో తేలిపోనున్న శాసనమండలి భవితవ్యం

శాసనమండలి రద్దుపై (AP Legislative Council Cancellation) ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ నిర్ణయం తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఆ తర్వాత ఈ అంశంపై తీర‍్మానం చేయనుంది.

Government to dissolve Legislative council Today (Photo-PTI)

Amaravathi, January 27: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం (AP Cabinet) కొద్ది సేపటి క్రితమే సమావేశమైంది. శాసనమండలి రద్దుపై (AP Legislative Council Cancellation) ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ నిర్ణయం తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఆ తర్వాత ఈ అంశంపై తీర‍్మానం చేయనుంది.

అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. అధికార వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది.

మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దానిని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో (AP Assembly) తీర్మానం ప్రవేశ పెట్టి, ఆమోదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత వారం అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను మండలి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం మండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది.

ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి

కాగా ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు మండలి కోసం ఖర్చు అవుతోందని సీఎం జగన్ (AP CM YS Jagan) ఇదివరకే అసెంబ్లీలో స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి వ్యవస్థ ఉండటాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్

ఒక వేళ అసెంబ్లీలో తీర్మానం చేసినా.. పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు ఎంత సమయం పడుతుందన్న దానిపైనా వైసీపీ కసరత్తులు చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా శాసనసభలో జరిగే చర్చలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించడంతో అసెంబ్లీ సమావేశం ఈ సారి ఏకపక్షంగా సాగనుంది.

రాజధాని వికేంద్రీకరణ బిల్లుల విషయంలో వేగంగా మారుతున్న పరిణామాలు

అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్‌ భేటీ తరువాత 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది.

3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్

బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై సభ్యులు చర్చించనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించే అవకాశముంది.