AP Capital: ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఇంకా రాని స్పష్టత, ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం, 17న మరోసారి సమావేశం కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ (High-power committee) మరోసారి సమావేశమైంది. రాజధానిపై జీఎన్ రావు (G N Rao committee) నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) (Boston Consulting Group,BCG)నివేదికపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
Amaravati, January 13: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ (High-power committee) మరోసారి సమావేశమైంది. రాజధానిపై జీఎన్ రావు (G N Rao committee) నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) (Boston Consulting Group,BCG)నివేదికపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
కాగా ఆయా నివేదికలోని వివిధ అంశాలపై కమిటీ భేటీ కావడం ఇది మూడోసారి. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారుడు అజేయ్ కల్లాం, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ముఖ్య అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... జిల్లాల వారిగా అభివృద్ధి అంశాలపై చర్చించామన్నారు. ఈనెల 17వ తేదీన మరోసారి సమావేశం అవుతామని తెలిపారు. 29 గ్రామాల రైతులు ప్రభుత్వానికి ఏమి చెప్పదలచుకున్నారో 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు చెప్పవచ్చన్నారు. సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖలు, ఈ మెయిల్స్ ద్వారా తమ అభిప్రాయల్ని తెలపవచ్చాన్నారు.
గత సమావేశంలో హై-పవర్ కమిటీ సభ్యుడు ఐ అండ్ పిఆర్ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రాంతీయ వివాదాలు ఉండవని, సమగ్ర అభివృద్ధి ఉంటుందని కమిటీ నిర్ధారిస్తోందని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయడానికి కమిటీ కూడా పరిష్కారాల కోసం చూస్తోందని వెంకటరామయ్య తెలిపారు. వారి నిర్ణయాన్ని ఖరారు చేయడానికి ముందు వారు అన్ని వర్గాల ప్రజల నుండి సలహాలు మరియు సిఫార్సులు తీసుకుంటారని ఆయన అన్నారు.
మరోమంత్రి కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందలా తయారయ్యారన్నారు. ఆయన ఆనందంగా ఉంటే అందరూ పండగ చేసుకోవాలంటారు. ఆయన బాధగా ఉంటే ఎవరూ సంతోషంగా ఉండకూదనుకుంటారని ఎద్దేవా చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. పోలీసులుగా తమ బాధ్యత వాళ్లు నిర్వహించారన్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు
ఇప్పటికే రెండు సార్లు సమావేశం
మొదటి సమావేశంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇచ్చిన నివేదికలపై చర్చించింది. రెండో సమావేశంలో రాజధాని రైతుల ఆందోళన, రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి, సచివాలయం ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. ఇప్పటికే సెక్రటేరియట్‌తోపాటు వివిధ శాఖల్లోని కొన్ని కీలక విభాగాలను విశాఖపట్నం తరలించే దిశగా హైపవర్ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తోంది. ఇదే క్రమంలో అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కావాలంటే, ప్లాట్లు లేదంటే.. భూమి తిరిగి ఇచ్చే అంశాలను పరిశీలించింది.
4వసారి కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
రెండవ సారి సమావేశమైన హై-పవర్ కమిటీ, అమరావతిపై దృష్టి సారించి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలను అభివృద్ధి చేయడానికి పలు సిఫార్సులు చేసింది. 10 మంది మంత్రులు మరియు ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీ జి ఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) యొక్క ముఖ్య సిఫారసులపై చర్చించింది. జి ఎన్ రావు కమిటీ మరియు బిసిజి నివేదికలను పరిశీలించిన తరువాత, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీ భావించినట్లుగా తెలిసింది.
క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఈనెల 17వ తేదీన మరో సారి సమావేశం, ప్రభుత్వానికి నివేదిక
రైతులు, ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని... వాటిపై మళ్లీ ఈనెల 17న చర్చించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విషయంపై హైపవర్ కమిటి దృష్టిపెట్టింది. ఆ మరుసటి రోజే అంటే 18వ తేదీనే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటి నివేదికపై చర్చ జరుగనుంది. దీంతో.. కమిటి సభ్యులు అన్ని విషయాలపై ఫోకస్ చేస్తున్నారు.
ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
18న జరిగే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేయటంతో పాటు 20న శాసనసభను సమావేశపరచడం ద్వారా తీర్మానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే సెక్రటేరియట్ ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. కేవలం 15వ తేదీన మాత్రమే సంక్రాంతి సెలవు ప్రకటించింది.
రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు
మరోవైపు... 27 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత ఆలస్యం జరిగితే మంచిదికాదని ప్రభుత్వం భావిస్తుండటంతో... సమావేశంలో హైపవర్ కమిటి బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలపై కూలంకుషంగా చర్చించడమే కాకుండా... సర్కారుకు ఇవ్వాల్సిన రిపోర్ట్‌పైన కూడా దృష్టిపెట్టే అవకాశం ఉంది.
మంత్రి బొత్స సత్యానారాయణ
సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యానారాయణ.. కొందరు రాజధాని రైతులు నా దగ్గరకు వచ్చారు. కొన్ని సమస్యలు చెప్పారు. అసలు అసైనీలకు కాకుండా.. వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవోను సవరించాలని కోరారని తెలిపారు.
ఇంకా ఎవరైనా రాజధాని రైతులు మా వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి బొత్స... ఉద్యోగుల తరలింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం... జిల్లాల వారీ అభివృద్ధి అనేది మా ప్రభుత్వ అజెండాగా అని స్పష్టం చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)