
Hyderabad, January 13: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States Chief Ministers) నేడు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..(Chief Minister K Chandrasekhar Rao)ఏపీ ముఖ్యమంత్రి జగన్(Chief Minister YS Jagan Mohan Reddy) ను విందుకు ఆహ్వానించారు. ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోని(Hyderabad) లోటస్ పాండ్‌లోనే ఉంటున్నారు. నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశం కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.
ఈ సమావేశానికి అధికారులకు సమాచారం లేకపోవడం, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏకాంత సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.అయితే ఇందులో పూర్తిగా రాజకీయ అంశాలే (Political)చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
విభజన చట్టంలోని కీలక అంశాలపై చర్చలు, ప్రధానంగా నీటి పంపకాలు
రాజధాని అమరావతిని(Amaravathi) విశాఖకు మార్పు వ్యవహా రం, అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కూడా చర్చకు వచ్చే వీలుందని సమాచారం.హైదరాబాద్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో మూడు సార్లు భేటీ అయ్యారు. కాగా..ఇది నాలుగో సమావేశం.
ఈ సమావేశంలో, వీరిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు(Telugu States) సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ ఉద్యోగుల విభజన, గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి మళ్లించడం వంటి అంశాలను పరిష్కరించనున్నట్లు సమాచారం.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుదీర్ఘ చర్చలు
గతంలో సమావేశమైనప్పుడు గోదావరి, కృష్ణ నదుల ప్రాజెక్టు ఏకీకరణపై సిఎంలు ఇద్దరూ ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమై పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు.
వాస్తవానికి, గోదావరి నీటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో ఒక ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే, తెలంగాణతో సంబంధం లేకుండా ఈ ప్రాజెక్టును సొంతంగా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.
క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
పోలవరం - బనకచార్ల క్రాస్ రెగ్యులేటర్ (బిసిఆర్) ఇంటిగ్రేషన్ పనులను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు
పోలవరం కుడి కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,633 క్యూసెక్కులు. అయితే, దీనిని 23,144 క్యూసెక్కులకు పెంచారు. మొత్తం 40,777 క్యూసెక్కుల గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ జలవిద్యుత్ ప్రాంతంపై నాగార్జునసాగర్ కుడి కాలువకు రెండు టిఎంసిల నీరు పంపిస్తారు.
విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
గుండవూరి జిల్లాలో అవసరమైన ప్రాంతాలకు కాలువలను పంపింగ్ చేసి పశ్చిమ ప్రకాశం అయక్కట్టుకు నీటిని పంపిణీ చేస్తున్నప్పుడు నల్లమల అడవులలో సుమారు 20 కి.మీ నుండి 25 కి.మీ.ల సొరంగం ద్వారా గోదావరి నీటిని బీసీఆర్ లోకి పంపిస్తారు. అక్కడి నుంచి గాలేరు - నగరి, తెలుగు గంగా, ఎస్‌ఆర్‌బిసి, కెసి కాలువకు గోదావరి నీటిని సరఫరా చేయడానికి డిపిఆర్ తయారు చేశారు.
రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి
సోమవారం జరగనున్న సమావేశంలో ఇదే సమస్యలను తెలంగాణ సిఎంకు ఏపీ సీఎం నివేదిస్తారని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటుగా CAA, NRC, కేంద్రంతో సంబంధాలు, ఆర్టీసీ విలీనం, అమరావతి వివాదంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు అనధికార సమాచారం.
అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ
ఇదిలా ఉంటే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని అపరిష్కృత అంశాలు.. జలవనరుల సద్వినియోగం, పలు కీలక విషయాలపై ఇరువురు సీఎంలు ఇదివరకే చర్చించనున్నారు. అంతేకాకుండా తొమ్మిది, పదో షెడ్యూల్డ్ సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలపై కూడా చర్చించి సాధ్యమైనంత త్వరగా.. సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ గతంలోనే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. వీటిపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.