Jagan Meets Amit Shah: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ‘దిశ’ చట్ట రూపం దాల్చాలి, శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టండి, అమిత్ షాతో భేటిలో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ సీఎం వైయస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Home minister Amit Shah) భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఏపీ సీఎం కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు.
New Delhi, Febuary 15: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Home minister Amit Shah) భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఏపీ సీఎం కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు.
వ్యక్తులను ఉద్దేశించి కోర్టులో పిటిషన్లు ఎలా వేస్తారు
నిన్న అమిత్ షాతో భేటిలో ‘దిశ’ (Disha ACT) చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని ఆయన అమిత్ షాకు విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
కాగా, మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని ( PM Modi) కలిసిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి (Andhra Pradesh) సంబంధించిన సమస్యలను వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు.
దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్
రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిగా ప్రణాళికలు రచించామని హోమంత్రికి ఏపీ సీఎం వివరించారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హోంమంత్రికి సీఎం జగన్ తెలియజేశారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు.
మిలీనియం టవర్స్‌కు రూ.19 కోట్లు విడుదల
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకూ 838 కోట్లను ఆదా చేశామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోందని, 2021 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉందని, ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు.
టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం 10,610 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. మిగిలిన నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు. ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉందని, ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించిందన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుచేశారు.
దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న హామీకి కట్టుబడి ఉండాలని తెలిపారు. అలాగే మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖకు సూచించి ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదించేలా చూడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి. ఇది 15వ ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన ఆదేశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని స్పష్టం చేసింది. అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)