YSR Jagananna Saswata Bhu Hakku-Bhu Raksha: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, భూసర్వే చురుగ్గా చేయాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు, అన్నిరకాల సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జరగాలని సూచన

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై (YSR Jagananna Saswata Bhu Hakku-Bhu Raksha) క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు‘‘భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, June 2: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై (YSR Jagananna Saswata Bhu Hakku-Bhu Raksha) క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు‘‘భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌తో మంద గమనంలో ఉన్న పథకం పరుగులు పెట్టాలి. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరాలి. క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలి. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ సీఎం (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు.

పథకాన్ని పూర్తి చేయడానికి అంకిత భావంతో ముందుకెళ్లాలి. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వే వెంటనే వేగం చేయండి. అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. సర్వే పూర్తైతే అన్నింటికి క్లియర్‌ టైటిల్స్‌ వస్తాయి. ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదు’’ అన్నారు. మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్‌ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్‌ చేయండి. సర్వే ఆలస్యంగా కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ 2023 నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి’’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం, జూన్ 3న వైఎస్సార్ జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవం

ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలి. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధృవీకరణ పత్రాల్లానే అన్నిరకాల సర్టిఫికెట్లు వారికి సచివాలయాల్లోనే అందేలా చూడాలి. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్‌ ఫార్మాట్‌లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలి. యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటిల్‌ ఫార్మాట్‌లో ఉంచాలి. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంచాలి. అలాగే ఒక డిజిటిల్‌ లైబ్రరీని అందుబాటులో ఉంచాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు.

ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకు మార్చిన అధికారులు, ఇక నుంచి కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ, కొరియర్ ద్వారా కృష్ణపట్నం మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఆనందయ్య బృందం

ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, రెవెన్యూ కమిషనర్‌ (సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ లాండ్ రికార్డ్స్) సిద్దార్ధ జైన్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ఐజీ ఎంవీవీ శేషగిరిబాబుతో పాటు, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.