Krishnapatnam Anandaiah Medicine: ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకు మార్చిన అధికారులు, ఇక నుంచి కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ, కొరియర్ ద్వారా కృష్ణపట్నం మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఆనందయ్య బృందం
Anandaiah Coronavirus Medicine (Photo-Twitter)

Nellore, june 2: నెల్లూరు బొనిగె ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు, హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పడు మందు (Nellore krishnapatnam anandaiah medicine) తయారీ పనిలో ఆనందయ్య నిమగ్నమయ్యారు. అయితే కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని ఉన్న ప్రదేశం నుంచి మరో చోటుకి మార్చారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీకి (cvr-security academy) మందు తయారీ కేంద్రాన్ని తరలించారు.

ఇప్పటివరకు పంపిణీ జరిగిన ప్రాంతంలోనే మందు (krishnapatnam anandaiah medicine) తయారీ చేయాలని ఆనందయ్య భావించారు. అయితే జిల్లా యంత్రాంగంతో కలిసి ఆనందయ్య (anandaiah) చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పటికే మందు తయారీకి కావల్సిన ముడి సరుకులు, ఇతర వంట సామాగ్రిని సీవీఆర్‌కు తరలించారు. కృష్ణపట్నంలో తయారు చేస్తే అక్కడకు కూడా ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో తయారీ కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు.

ఆనందయ్య కరోనా మందులు ఎలా వాడాలి, వాటిని ఎలా తయారుచేస్తారు, కరోనా పేషెంట్లు అయితే ఏ మందులు వాడాలి, నెగిటివ్ ఉన్న వారు ఏమి వాడాలి, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై వివరణాత్మక కథనం

ఆనందయ్య మందు తయారీ సమయంలో భద్రత తదితర విషయాల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. తయారీకి కావలసిన మూలికలు ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని ఆనందయ్య కోరారు. అవసరమైతే గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి తేనే సప్లై చేస్తామని కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు.

ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పేషెంట్ల బంధువులు మాత్రమే కృష్ణపట్నం రావాలని సూచన, మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశాలు

నేటి నుంచి childeal.in పేరుతో ఆనందయ్య మందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆనందయ్య బృందం తెలిపింది. సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందును సోమవారం (ఈనెల 7వ తేదీ) నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. మందు తయారీ, పంపిణీ గురించి మంగళవారం నెల్లూరులోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీలు హరేందిరప్రసాద్, గణేష్‌కుమార్, మందు తయారీదారు ఆనందయ్య తదితరులతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వనమూలికలు సమకూర్చుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారన్నారు.