
Amaravati, June 2: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ (Advisors Tenure Extended To One year) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల 18వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.
ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తోంది. అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (కో–ఆర్డినేటర్–కార్యక్రమాలు) తలశిల రఘురాం పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని అప్పటి నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి (AP CM YS Jagan) సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రేపటి నుండి వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. 28 లక్షల 30 వేల మందికి పక్కాఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడతగా 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రూ.51 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.