Vjy, Nov 22: ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులకు ఏపీ శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. దీంతో పాటుగా చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది. సహజవాయువు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024ను శాసనమండలి ఆమోదించింది.కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తరువాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 2024 రద్దు బిల్లును మండలి ఆమోదించింది. పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థల దేవాదాయ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖను కోరుతూ శాసనమండలిలో తీర్మానం చేశారు.
శాసన మండలిలో ఆమోదం పొందిన బిల్లులివే..
చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని శాసనమండలి రద్దు చేసింది
లోకాయుక్త సవరణ బిల్లు 2024కు శాసనమండలి ఆమోదం
గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కు శాసన మండలి ఆమోదం
ఏపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు మండలి ఆమోదం
ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం
ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకు శాసనమండలి ఆమోదం
పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.