AP Capital Shifting Row: రాజధాని తరలింపులో కీలక ట్వీస్టు, రంగంలోకి సచివాలయ ఉద్యోగులు, అమరావతి పరిరక్షణ సమితి అన్నీ అబద్దాలు చెప్పిందంటూ హైకోర్టులో అనుబంధ పిటిషన్
ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కీలక మలుపులు (ap three capitals Row) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమరావతి నుంచి విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని తరలింపు వ్యవహారంలో ట్విస్టు (AP Capital Shifting Row) చోటు చేసుకుంది. మూడు రాజధానులు, విశాఖకు రాజధాని తరలింపు అంశాలపై కోర్టులో విచారణ జరుగుతుండగా, మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో (AP High Court) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (AP Secretariat employees Union) ఇంప్లీడ్ పిటిషన్‌ను వేశారు.
Amaravati, July 29: ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కీలక మలుపులు (ap three capitals Row) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమరావతి నుంచి విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని తరలింపు వ్యవహారంలో ట్విస్టు (AP Capital Shifting Row) చోటు చేసుకుంది. మూడు రాజధానులు, విశాఖకు రాజధాని తరలింపు అంశాలపై కోర్టులో విచారణ జరుగుతుండగా, మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో (AP High Court) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (AP Secretariat employees Union) ఇంప్లీడ్ పిటిషన్‌ను వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం, కన్నా లక్ష్మీనారాయణకు ఉద్వాసన, కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఈ పిటిషన్లో.. పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని ఏ ఉద్యోగుల సంఘమూ వ్యతిరేకించడం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవన్నారు. ప్రజల్లో తమ సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తూ సమితి పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల అందరి హక్కని పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కాని రైతులు కాదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగాయని, అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డు పడుతుందని పేర్కొన్నారు. తప్పుడు లెక్కలు అవసరం లేదు, లక్ష కేసుల్లో సగం మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు, వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఎదురు చూద్దాం, కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
రాజధాని అమరావతిలో (Amaravati) 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పిటిషన్‌లో వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కొందరి రాజకీయ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే హైకోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. రాజధాని తరలింపునకు అయ్యే ఖర్చు రూ. 70 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. రాజధాని తరలింపు వల్ల ఖజానాపై రూ.5,116 కోట్ల మేర భారం పడుతుందన్న వాదనలో వాస్తవం లేదని, ఇందులో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ మంగళవారం అనుబంధ పిటిషన్ వేశారు.
ఈ ఏడాది మార్చి 18న సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘ సమావేశంలో రాజదాని తరలింపుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తాము కోరినట్లు, ప్రభుత్వం తరఫున తాయిలాలు ఆశ చూపినట్లు రైతులు తమ పిటిషన్లలో పేర్కొనడంపై సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజధాని తరలింపు కోసం ఉద్యోగులకు ఇంటి లోన్, మెడికల్ సబ్సిడీ వంటి తాయిలాలు ఆఫర్ చేసినట్లు పిటిషనర్లు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారని, కాబట్టి ఈ పిటిషన్ కొట్టేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి నిరాధార పిటిషన్లు వేయకుండా భారీ జరిమానా విధించాలని కోర్టును కోరినట్లు ఉద్యోగులు వెల్లడించారు.
రూ.2 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినందునే ఉద్యోగులు తరలింపుపై అంగీకరించారని సమితి మాపై ఆరోపణలు చేసింది. కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనవాయితీ. గత సర్కారు అమరావతిలో ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు 500 గజాల చొప్పున స్థలం ఇచ్చింది. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూ.25 లక్షలను రుణంగా ఇవ్వడం వల్ల రూ.2,500 కోట్లు నష్టం వాటిల్లుతుందంటూ అమరావతి పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చింది.
సర్వీసును బట్టి ప్రతి ఉద్యోగి గరిష్టంగా రూ.12 లక్షల గృహ రుణం పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులు జీతభత్యాల్లో ఇది భాగం. ఉద్యోగి బదిలీ అయినప్పుడు రవాణా, షిఫ్టింగ్ భత్యం ఇస్తారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం కూడా చెల్లించింది. తరలింపు ఖర్చు రూ.70 కోట్లకు మించదని పిటిషన్లో తెలిపారు.
గత ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో భాగంగా 62 ప్రాజెక్టుల కోసం రూ.52,837 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించిందని సమితి చెబుతోంది. రూ.11 వేల కోట్లతో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది. 20 శాతం నిధులతో 70 శాతం పనులను పూర్తి చేశామని చెప్పడం విస్మయం కలిగిస్తోందని అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)