CM Jagan Video Conference: తప్పుడు లెక్కలు అవసరం లేదు, లక్ష కేసుల్లో సగం మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు, వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఎదురు చూద్దాం, కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
AP CM YS Jagan Video Conference With Collectors on Coronavirus situation in districts (Photo-AP CMO)

Amaravati, July 28: కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ (AP CM YS Jagan Video Conference) ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు (AP Coronavirus) లక్ష దాటాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందులో సగం మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారని సీఎం తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు, తూర్పు గోదావరిలో ఆగని కోవిడ్-19 కల్లోలం, ఏపీలో 1,090కు చేరిన మృతుల సంఖ్య, కర్ణాటకలో లక్ష దాటిన కరోనా కేసులు

కోవిడ్‌-19 లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేసులు తక్కువ చేసి చూపలేదని పేర్కొన్నారు. దేశంలోనే రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని, దాదాపు ప్రతి మిలియన్‌కూ 31వేలకు పైగా టెస్టులు (Covid Tests) చేస్తున్నామని సీఎం తెలిపారు. 90 శాతం టెస్టులు కోవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నాం. కోవిడ్‌ సోకిన వారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. విశ్లేషణాత్మక ధోరణితో ముందుకు పోవాలి. రాష్ట్రంలో లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. అందులో సగం మందికి నయమైపోయింది. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోయినా.. మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేశాం’అని సీఎం పేర్కొన్నారు.

Here's AP CMO Report

’కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి (Coronavirus Situation) ఉంది. కోవిడ్ వస్తుంది పోతుంది కూడా. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ వేచి చూడాలి. మధ్యప్రదేశ్‌ సీఎంకు కూడా కరోనా వచ్చింది. కరోనా రావడమన్నది పాపం కాదు.. నేరం కాదు. కరోనా కారణంగా చనిపోయిన వారి నుంచి...వైరస్ వ్యాపించకుండా చేయాల్సినవన్నీ చేస్తున్నాం. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ ఉండదు. బంధువులకు కూడా మనం అంత్యక్రియలు చేయకపోవడం విచారకరం. మానవత్వమే మరగున పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. విశాఖలో చిన్న పిల్లల అక్రమ రవాణా గుట్టు రట్టు, కీలక సూత్రధారి పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురు ఆరెస్ట్, కేసు వివరాలను వెల్లడించిన సీపీ ఆర్కే మీనా

బంధువులు రాకపోతే ప్రభుత్వమే దగ్గరుండి పద్ధతి ప్రకారం వారికి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ప్రభుత్వమే దగ్గరుండి భౌతికకాయాలను తరలిస్తుంది. ప్రజలకు అండగా ఉన్నామని ప్రభుత్వం వైపు నుంచి గట్టి సంకేతం పోవాలి. కరోనాపై ఎవరికీ భయాందోళనలు ఉండకూడదు కరోనాపై అవగాహన పెంచుకుని, దైర్యంగా ఎదుర్కోవాలి’అని ముఖ్యమంత్రి తెలిపారు.

కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? ఎవరికి కాల్‌ చేయాలన్నదానిపై.. వివరాలు అందరికీ తెలియజేయాలని అన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా గురించి పోస్టర్లు ఉంచాలని అధికారులకు సూచించారు. ‘104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఇచ్చాం. జిల్లాలో కోవిడ్‌ కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్‌ ప్రకటనలు ఇచ్చాం. ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్‌ చేసినప్పుడు.. సమర్థవంతంగా పనిచేసేలా చేయాలి.

కోవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులవద్ద.. రాష్ట్రస్థాయి కోవిడ్ ‌ఆస్పత్రుల వద్ద ఫిర్యాదు చేయడానికి.. 1902 నంబర్ ‌డిస్‌ప్లే చేయాలి. ఆస్పత్రి సదుపాయాలపై ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే వెంటనే స్పందించాలి. 128 జిల్లా ఆస్పత్రులు, 10 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో.. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు డిస్‌ ప్లే చేయాలి. పబ్లిక్‌ డొమైన్‌లో ఈ వివరాలు పెట్టాలి. కేవలం సదుపాయాలే కాదు, అందుబాటులో డాక్టర్లు ఉన్నారా? పారిశుద్ధ్యం బాగుందా? భోజనం బాగుందా? అనే పర్యవేక్షణ జరగాలి. మానవత్వంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. ఒక బలమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలి’అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.