Badvel Horror Update: ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు

భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ పేరుతో ఆ మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి అల్టిమేటం జారీ చేశాడు.

Badvel inter student dead (Credits: X)

Badvel, Oct 20: అతనికి పెండ్లయ్యింది. భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ (Love) పేరుతో ఆ  మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి (Inter Student) అల్టిమేటం జారీ చేశాడు. తన ప్రేమకు ఒప్పుకోకపోతే చస్తా అంటూ బెదిరించాడు. అయినప్పటికీ, ఆ విద్యార్థిని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఏకంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కడప జిల్లా బద్వేల్‌ లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో స్థానిక దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం సదరు విద్యార్థిని ప్రాణాలు విడిచింది.

గ్రూప్-1 ప‌రీక్షపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ఇంట్లో కీల‌క చ‌ర్చ‌లు

అసలేం జరిగిందంటే?

విగ్నేశ్ అనే 20 ఏళ్ల యువకుడు ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు. విగ్నేశ్ కు ఇదివరకే పెండ్లయ్యింది. భార్య గర్భిణి. ఇవేమీ పట్టించుకోకుండా బాధితురాలి వెంట పడుతున్నాడు ఆ మృగాడు. ఈ క్రమంలో మాట్లాడుదామని, రాకుంటే తాను ఆత్మహత్యకు పాల్పడుతా అని బెదిరించాడు. భయపడిపోయిన సదరు బాలిక ఆ మృగాడితో  బద్వేల్ శివారుల్లోని సెంచరీ ప్లై ఉడ్ కు చేరుకుంది. ఇదే అదునుగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను విగ్నేశ్ పిలిచాడు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, తిరస్కరించిన బండి, గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి దీక్ష 

తనను ప్రేమించాలని మళ్లీ బలవంతపెట్టాడు. యువతి అంగీకరించకపోవడంతో ఆమెకు నిప్పంటించాడు.  శనివారం మధ్యాహ్నం వేళ.. హైవే 67పై కొనఊపిరితో యువతి కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన స్పాట్‌ కు చేరుకున్న పోలీసులు చికిత్స కోసం ఆమెను 108 వాహనంలో బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం బాధితురాలు మరణించింది. విగ్నేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.