Hyderabad, OCT 19: మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు.. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష(Group 1), జీవో 29 అంశంపై (GO 29) చర్చించినట్టు సమాచారం. గ్రూప్-1 అభ్యర్థులు (Group -1 Candidates) చేస్తున్న విజ్ఞప్తులు, పరీక్షల వాయిదా సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.
మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy).. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 పరీక్షలు యధాతధంగా జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 95శాతం మంది అభ్యర్థులు ఇప్పటికే హాట్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, మరో 5శాతం మంది డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దని, వారి ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు సీఎం రేవంత్. పోలీస్ డ్యూటీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై స్పందించారు.