AP Entrance Exams Postponed: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన ఏపీ ఉన్నత విద్యామండలి

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

IPE Exams 2020. Representational Image. | Photo: PTI

Amaravati, April 12: ఏపీలో కరోనావైరస్ (coronavirus in AP) విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ తన అధికారిక వెబ్సైట్ లో పోస్టు చేసింది. ఈ వైరస్ కారణంగా మే 14 , 2020 వరకు జరగాల్సిన అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE)తెలిపింది.  రోడ్డుపై ఉమ్మి వేస్తే జైలుకే

అంతేకాకుండా ఏప్రిల్ 20, 2020 నుంచి జరగాల్సిన ఏపీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ప్రవేశ పరీక్షలను కాకినాడలోని జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి.

ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు

ఈ ప్రవేశ పరీక్షలకు అభ్యర్దులు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవటానికి మార్చి 29, 2020 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 17, 2020 వరకు పొడిగిస్తూ ఏపీ స్టేట్ ఉన్నత విద్యామండలి తెలియజేసింది. అంతేకాకుండా త్వరలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు APSCHEఆఫీసర్ డాక్టర్ ఎం.సుధాకర్ రెడ్డి తెలిపారు.

కాగా http://www.apsche.org/apsche_new/ వెబ్ సైట్లో ‘‘All Common Entrance Test of AP has been postponed and revised schedule for conduct of Tests announced later in due course’’అంటూ అప్ డేట్ ఇచ్చింది.

వాయిదా వేసిన ప్రవేశ పరీక్షలలో AP EAMCET 2020, AP - ICET 2020, AP- ECET 2020 వంటివి ఉన్నాయి. ఇంతకుముందు, APSCHE పరీక్షలకు నమోదు చేయడానికి చివరి తేదీని మార్చి 29 నుండి ఏప్రిల్ 17 వరకు పొడిగించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 20 నుండి 23 వరకు నిర్వహించాల్సి ఉంది.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా AP- EAMCET 2020 పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు వాయిదా పడ్డాయి. సవరించిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.