Hyderabad, April 12: కరోనా (COVID-19) మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్ సహా రాష్ట్రంలో మే నెలలో జరగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా (CETs Exams Postponed) వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి (TSCHE chairman Prof. T.Papi Reddy) తెలిపారు. కాగా, ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్, ఈసెట్ వీటితో పాటుగానే ఇతర ప్రవేశ పరీక్షలను కూడా 15 రోజుల పాటు వాయిదా వేసారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఈ నెల 30వ తేది వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ పేర్కొన్నారు.
లాక్‌డౌన్ వేళ కొడుకు కోసం ఓ తల్లి రాష్ట్రాన్ని దాటింది
వాస్తవానికి విద్యాశాఖ అధికారులు ముందస్తుగా నిర్ణయించి షెడ్యూల్ ప్రకారం ఈ సెట్ పరీక్షను మే2న నిర్వహించాల్సి ఉండగా, మే 4, 5, 7, 9, 11 తేదీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించాల్సి ఉంది. కాగా ఈ నెల 14వ తేది వరకు లాక్ డౌన్ ను తీసేస్తామని ప్రభుత్వం ముందుగా చెప్పినప్పటికి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులును దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30వ తేది వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన
దీంతో మళ్లీ ప్రవేశ పరీక్షలు మరోసారి వాయిదా వేస్తున్నామని పాపిరెడ్డి తెలిపారు. 14వ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందనే ఆలోచనలో ఉన్నత విద్యామండలి అన్ని ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించింది. ఇక ఈ పరీక్షలు వాయిదా పడినప్పటికీ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ముందుగా నిర్వహించాల్సిన ఈసెట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలు మాత్రమే కాకుండా మిగతా అన్ని పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని ఉన్నత విద్యామందలి అధికారులు తెలిపారు.