AP CM YS Jagan Review: ఏపీలో బస్సు సర్వీసులపై తాజా మార్గదర్శకాలు, వలస కార్మికుల తరలింపు తరువాతే బస్సులు ప్రారంభం, లాక్‌డౌన్ సడలింపులపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 (COVID 19) నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ సడలింపులపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati,May 19: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ 4 (Lockdown 4) కొనసాగుతూ కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 (COVID 19) నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ సడలింపులపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. కరోనాని జయించిన 9 నెలల చిన్నారి, ఏపీలో 2339కి చేరిన కోవిడ్-19 కేసులు, ఐసీఎంఆర్‌ సవరించిన మార్గదర్శకాలు ఓ సారి తెలుసుకోండి

అంతర్‌ రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలన్నఅనే విషయంపై చర్చలు జరిపారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రంలోకి రావాలనుకుంటున్నవారికి బస్సులు ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా సమీక్ష చేశారు. దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని జగన్‌ అధికారులకు సూచించారు.

Here's AP CMO Tweet

బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఇ‍వ్వకూడదని తెలిపారు. బస్టాండ్‌లో దిగిన తరువాత వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని దాని వల్ల వారిని ట్రేస్‌ చేయడం సులభంగా ఉంటుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నిర్వహించాలని, బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 75 రోజులకు 10 వేల కేసులు, ఇప్పుడు ఏకంగా లక్ష దాటేశాయి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో 11వ స్థానానికి చేరుకున్న భారత్

బస్సు ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడ ఎక్కారు? ఎక్కడికి వెళుతున్నారన్న దానిపై స్పష్టమైన వివరాలు సేకరించాలని తెలిపారు. ఆపై, రాష్ట్రంలోనూ భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని స్పష్టం చేశారు. బస్సు సర్వీసులు నడిపేందుకు సమగ్ర రీతిలో విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు. ఆరేళ్ల చిన్నారితో గది శుభ్రం, తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీకి ఆదేశాలు

కారులో ముగ్గురికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలిపారు. పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రెస్టారెంట్లలో భోంచేయడం వీలుకాదని, రెస్టారెంట్ల నుంచి పార్శిల్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని, అది కూడా భౌతికదూరం పాటిస్తూ పార్శిల్ తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు. దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.

వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాతే రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని జగన్‌ నిర్ణయించారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని, ప్రైవేట్‌ బస్సులు కూడా అనుమతినివ్వాలని సీఎం నిర్ణయించారు. ఇక బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు