Andhra pradesh dgp-gautam-sawang-calls-people-support-janata-curfew (Photo-Facebook)

Amaravati, May 19: నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా, కొందరు పోలీసులు అక్కడే నిలుచుని చూస్తూ ఉండడం మీడియాలో కనిపించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఆ చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా (Nellore Child Labour Issue) ఖండించకుండా చూస్తూ ఉండటంతో ఇది ఇంకా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Gautam Sawang) ఘటనపై స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.  75 రోజులకు 10 వేల కేసులు, ఇప్పుడు ఏకంగా లక్ష దాటేశాయి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో 11వ స్థానానికి చేరుకున్న భారత్

చిన్నారి పనులు చేయాల్సి రావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాల కార్మిక నిషేధ చట్టం కింద ఈ ఘటనకు బాధ్యులు శిక్షార్హులని అభిప్రాయపడ్డారు. దీనిపై 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుందని, రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారని సవాంగ్ వెల్లడించారు. బాలలతో పనులు చేయించడం చట్ట వ్యతిరేకమని ఎంతో ప్రచారం చేస్తున్నా గానీ ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Here's Video

కాగా ఆత్మకూరు ప్రభుత్వ కాలేజీలో (Atmakuru Government Junior College) ఓ చిన్నారితో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాలేజీ గదిని శుభ్రం చేస్తున్న చిన్నారి దృశ్యాలు తన హృదయాన్ని కలచివేసిందని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఓ తండ్రి తన పనిని కూతురి చేత చేయించడం కూడా చట్టరిత్యా నేరమే అవుతుందన్నారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్స్‌ ప్రేక్షక పాత్ర వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించారు. కళాశాల యాజమాన్యంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. పెను తుఫానుగా మారిన అంఫాన్, ఒడిశాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు, రేపు తీరం దాటే అవకాశం, ఒడిశా, బెంగాల్‌కు పొంచి ఉన్న ముప్పు, ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

చైల్డ్‌ లేబర్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌–1986 ప్రకారం 14 ఏళ్లు నిండని బాల బాలికల చేత చాకిరీ చేయించడం నిషిద్ధం. సెక్షన్‌ 14 ప్రకారం శిక్షార్హం. పని చేయించిన వ్యక్తులకు కనీసం 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. బాల బాలికలను ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించడం కూడా నేరమే అని తెలియచేసేలా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు.