Satellite picture of cyclone Amphan (Photo Credits: IMD)

New Delhi, May 19: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంఫాన్‌' తుఫాన్‌ (Cylcone Amphan) మహాతుఫానుగా (super cyclone) మారినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ తుఫాను తాకిడికి గంటకు 200 కిమీవేగంతో పెనుగాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. 75 రోజులకు 10 వేల కేసులు, ఇప్పుడు ఏకంగా లక్ష దాటేశాయి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో 11వ స్థానానికి చేరుకున్న భారత్

బుధవారం మధ్యాహ్నానికి ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ ( NDRF chief SN Pradhan) తెలిపారు.

ఈ క్రమంలో ఒడిశాకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు చేరుకున్నాయి. కేంద్రపార, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌భంజ్‌, జాజ్‌పూర్‌, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాల్లో అంఫాన్‌ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భువనేశ్వర్‌ ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్‌ ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. ఈ క్రమంలో జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు దిగాయి.  20 మంది ప్రయాణీకులతో బస్‌లకు అనుమతి, సెలూన్‌, బార్బర్‌ షాపుల మూసివేత, భారీ సడలింపులు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

తుపాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు ప్రకటించాయి.

Here's ANI Tweet

కాగా అంఫాన్‌ ప్రభావంపై (#AmphanCyclone) ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం సమీక్షించారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. సమావేశం తర్వాత ప్రధాని ట్వీట్‌చేస్తూ.. ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.

Here's PM Tweet

తుఫాన్‌ పరిస్థితులను ఎదుర్కొ నేందుకు ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతాల నుంచి సుమారు 11 లక్షల మందిని తరలించేందుకు ఒడిశా చర్యలు చేపడుతున్నది. సైక్లోన్‌ వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదని సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు.

హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో అమ్ఫాన్ సైక్లోన్ గురించి మాట్లాడారు. రాష్ట్రానికి సహాయం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని పశ్చిమ బెంగాల్ సిఎంకు హామీ ఇచ్చారు & ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రాష్ట్రానికి అవసరమైన సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని MHA వర్గాలు తెలిపాయి.

Here's ANI Tweet

ఈ నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం తీర ప్రాంతాల జిల్లాలను అప్రమత్తం చేసింది. 1999లో ఒడిశాపై మహాతుఫాన్‌ విరుచుకుపడి దాదాపు 10వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత ఒడిశాపై విరుచుకు పడనున్న రెండవ మహా తుఫాన్‌ అంఫాన్‌ అని అధికారులు తెలిపారు.

Amphan Cyclone Effect on Vaikom Mahadeva Temple

బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. అంఫాన్‌ తుపాను హెచ్చరిక నేపథ్యంలో అన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై ప్రచారం చేయాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని అధికారులు సూచించారు.