Amaravati,May 19: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో (COVID 19 in AP) కరోనా బారిన పడిన వారి సంఖ్య 2339కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ( AP Coronavirus Report) 57 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని తెలిపింది. 75 రోజులకు 10 వేల కేసులు, ఇప్పుడు ఏకంగా లక్ష దాటేశాయి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో 11వ స్థానానికి చేరుకున్న భారత్
ఈ రోజు ఒక్కరోజే 69 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోరి చొప్పున మృత్యువాత పడ్డారని పేర్కొంది. కాగా, ఇప్పటి వరకు 1596 మంది వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 691మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మొత్తం 52మంది మరణించారు.
నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి కరోనాను జయించింది. కోటమిట్ట ప్రాంతంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఆ ప్రాంతంలోని వారందరికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో పాపకు పాజిటివ్‌గా తేలింది.
Here's AP Corona Report
#COVIDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,739 సాంపిల్స్ ని పరీక్షించగా 57 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*69 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
*కోవిడ్ వల్ల చిత్తూర్ మరియు కర్నూల్ లో ఒక్కొక్కరు మరణించారు.#APFightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 19, 2020
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2339 పాజిటివ్ కేసు లకు గాను 1596 మంది డిశ్చార్జ్ కాగా, 52 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 691. #APFightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 19, 2020
ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత పాప కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఆరేళ్ల చిన్నారితో గది శుభ్రం, తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీకి ఆదేశాలు
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై భారత వైద్య పరిశోధన మండలి(ICMR) సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్ సోమవారం ఐదోసారి సవరించిన గైడ్‌లైన్స్‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్లకు విధిగా ఆర్‌టీ–పీసీఆర్ (రియల్ టైమ్ పల్మనరీ చైన్ రియాక్షన్) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
8 కేటగిరీల్లో ఎవరెవరు ఉన్నారు
ఐఎల్‌ఐ (ఫ్లూ లక్షణాలు ఉన్న) వాళ్లకు.. వ్యక్తిగతంగా గానీ, అంతర్జాతీయ ప్రయాణం చేసిన వారికి(14 రోజుల్లో).
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన ఐఎల్‌ఐ లక్షణాలు ఉన్నవారికి.
ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఐఎల్‌ఐ లక్షణాలున్న వారు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో సంబంధం ఉన్నవారు.
తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్)తో బాధపడుతున్నవారు.
ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా(అసింప్టమాటిక్) హైరిస్క్ పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్నవారు లేదా టెస్టు చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయినవారు. æ హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో వైరస్ లక్షణాలున్న అందరికీ.
ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి. æ కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదు.