Special Trains: ఏపీ నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల లిస్టు వచ్చేసింది, సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వేశాఖ, ఏపీ నుంచి 24 ప్రత్యేక రైళ్ల రాకపోకల సమాచారం మీకోసం

అన్‌లాక్‌ 4.0లో (Unlock 4) భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.

Big gift of Indian Railways, now passengers will get confirm seat in general coach(Photo-ANI)

Amaravati, Sep 12: సెప్టెంబర్ 12 నుంచి ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను (IRCTC special trains) నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అన్‌లాక్‌ 4.0లో (Unlock 4) భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

ఈ నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ పరిధి విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించింది. ఈ స్పెషల్‌ రైళ్లకు రిజర్వేషన్‌ ఈ నెల 10వ తేదీనుంచి ప్రారంభమవుతుందని వాల్తేర్‌ డివిజనల్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కే.త్రిపాఠి ఓ ప్రకటనలో పేర్కొన్నారు

 వెయిటింగ్ లిస్టు ఉండదు, ఈ నెల 10 నుంచి 80 ప్రత్యేక రైళ్లకు బుకింగ్ ప్రారంభం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ, వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఇకపై ముందుగానే గమ్యానికి

విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12వ తేదీ నుంచి విశాఖలో ప్రారంభమై ప్రతిరోజు రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి కోర్బాలో ప్రారంభమై ప్రతిరోజు సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్‌ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్‌పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్‌లలో ఆగుతుంది.

ఇతరులతో సంబంధం లేకుండా టాయ్‌లెట్ పైపుల ద్వారా కోవిడ్19

విశాఖ మీదుగా నడిచే రైళ్లు

తిరుచ్చిరాపల్లి–హౌరా–తిరుచ్చిరాపల్లి( 02664 / 02663) వీక్లీ స్పెషల్‌ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై ప్రతి మంగళ, శుక్రవారాలలో సాయంత్రం 4.20గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో 17 నుంచి ప్రారంభమై ప్రతి గురు, ఆది వారాలలో సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.

గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్‌–గౌహతి(02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్‌ రైలు గౌహతిలో 13 నుంచి ప్రారంభమై ప్రతి ఆది, సోమ, మంగళవారాలలో ఉదయం 6.20గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్‌లో 16 నుంచి ప్రారంభమై ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రాత్రి 11.40గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను రన్‌గియా, న్యూ జల్పయ్‌గురి, మాల్డా టౌన్, హౌరా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్‌ కియోంఝర్‌ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఇతర ముఖ్య స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది.

అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు. జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు తోమర్, సురేష్, అక్టోబరు నుంచి ప్రతి రోజూ ఢిల్లీకి కిసాన్ రైలు

ఈ స్పెషల్‌ రైళ్లకు టికెట్స్‌ రిజర్వేషన్‌ కౌంటర్స్‌ వద్ద, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని, కేవలం కన్ఫర్మ్‌ టికెట్స్‌ ఉన్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు.

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో (Vijayawada Railway division) ఈ నెల 12 నుంచి రైళ్లను పెంచనున్నారు. కోవిడ్‌–19 కారణంగా ఇప్పటి వరకు 14 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన రైల్వేశాఖ.. ఇక నుంచి 24 రైళ్లకు పెంచాలని నిర్ణయించింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటోందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

వికటించిన ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసిన ఆక్స్‌ఫర్డ్, సురక్షితమని తేలితేనే వ్యాక్సిన్ బయటకు తెస్తామని తెలిపిన ఫార్మా సంస్థలు

డివిజన్‌ పరిధిలోని ఒక్కో జిల్లాలో ఒకొక్క స్టేషన్లో మాత్రమే రైలు ఆగుతుంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. షెడ్యూల్‌ రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గతంలోలా ఈ 24ను ప్రత్యేక రైళ్లగానే నడుపుతారు. ముందుగానే రిజర్వేషన్లు ఇస్తారు. రైలులో ఎక్కేందుకు గంట ముందుగానే రావాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాతనే రైలులోకి అనుమతిస్తారు. బోగీలు శానిటైజేషన్‌ తరువాతనే ప్రయాణీకుల్ని అనుమతిస్తున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాలనే నిబంధన పెట్టారు.

12వ తేదీ నుంచి నడిచే 24 రైళ్లు ఇవే

ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌– చాప్రా (02669), ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌– న్యూఢిల్లీ(02615), హౌరా–సికింద్రాబాద్‌ (02703), విశాఖపట్నం–న్యూఢిల్లీ (02805), హౌరా–యశ్వంత్‌పూర్‌ (02245), భువనేశ్వర్‌–ముంబై(01020), తిరుచ్చిరాపాలి –హౌరా (02664), దానాపూర్‌– కెఎస్‌ఆర్‌ బెంగళూరు (02296), చాప్రా–ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌ (02670), గుంటూరు– సికింద్రాబాద్‌ (07201), హౌరా–తిరుచ్చిరాపాలి (02663), ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌– న్యూఢిల్లీ (02433), బెంగళూరు కంటోన్మెంట్‌–గౌహతి (02509), ముంబై–భువనేశ్వర్‌(01019), న్యూఢిల్లీ–ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌ (02434), సికింద్రాబాద్‌–గుంటూరు (07202), గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్‌ (02510), సికింద్రాబాద్‌–హౌరా (02704), కెఎస్‌ఆర్‌ బెంగళూరు–దానాపూర్‌ (02295), యశ్వంత్‌పూర్‌–హౌరా (02246), న్యూఢిల్లీ–విశాఖపట్టణం (02806), హైదరాబాద్‌– విశాఖపట్టణం (02728), న్యూఢిల్లీ –ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌ (02616), విశాఖపట్నం– హైదరాబాద్‌ (02727).